యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి
యాదాద్రి – భువనగిరి, మార్చి 18 : దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
శనివారం ఉదయం ఆలయానికి చేరుకోగానే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి ఆహ్వానం పలికారు. ఆలయం వద్ద అర్చకులు, అధికారులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత యాదాద్రి ఆలయ నిర్మాణం, పరిసరాలను శ్రీ సచ్చిదానంద స్వామి పరిశీలించారు.