Take a fresh look at your lifestyle.

ప్రమాదంలో బీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల నాటికి కనుమరుగు?

ప్రజలు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు బీఆర్ఎస్ కు అవకాశం కల్పించినప్పటికీ.. కేసీఆర్ అతి ఆశకు పోయి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తన పార్టీలో చేర్చుకున్నారు

0 238
  • గులాబీ పార్టీకి కాషాయ పార్టీ గండం
    కేసీఆర్ కు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అంతే

నిర్దేశం, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టి, రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. తెలంగాణ అంటే బీఆర్ఎస్ (పాత టీఆర్ఎస్).. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్లు కనిపిస్తుండే. రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీగా ప్రజల్లో ఆదరణ పొంది పదేళ్ల పాటు సంపూర్ణ అధికారంతో రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన గులాబీ పార్టీ, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కనిపిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

రెండు కారణాలు బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కసీటు కూడా రాకపోవడం, సగానికిపైగా అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాకపోవడం ఒక కారణం అయితే, బీజేపీ, కాంగ్రెస్ రూపంలో ఆ పార్టీకి పొంచి ఉన్న ముంపు కూడా వాస్తవం. రాజకీయాల్లో రెండో స్థానంలో ఉన్న పార్టీ పైకి లేవడం పెద్ద విషయమేమీ కాదు కానీ, మూడు నుంచి ఆ కిందకు పడిపోతే పతనేమనని చారిత్రక వాస్తవాలు చెబుతున్నాయి.

కేసీఆర్ చేసిన తప్పే శాపమైంది
ప్రజలు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు బీఆర్ఎస్ కు అవకాశం కల్పించినప్పటికీ.. కేసీఆర్ అతి ఆశకు పోయి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తన పార్టీలో చేర్చుకున్నారు. ఒక రకంగా రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా ఉండాలని కేసీఆర్ అనునుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని 12 మంది ఎమ్మెల్యేలను తనవైపుకు లాక్కున్నారు. జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీ మింగేయాలని చూడడం అత్యాషే అవుతుంది. పరిస్థితి తిరగబడితే ప్రాంతీయ పార్టీ ఆనవాలు కూడా మిగలకుండా జాతీయ పార్టీ చేయగలదు. కాంగ్రెస్ కనుక కేసీఆర్ లాగే ఆలోచిస్తే బీఆర్ఎస్ మిగిలేది ఎందరు అనేది అసలైన ప్రశ్న.

బీజేపీ ముప్పు
మంటకు పెట్రోల్ తోడైనట్టు.. రాష్ట్రంలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో ఉన్న బీజేపీకి.. తాజా ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు వచ్చాయి. దీంతో దాదాపు 50  అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి బలం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కావాలని బీజేపీ అనుకోవచ్చు. అలా అనుకుంటే ప్రభుత్వం ఉన్నవారిని లాగడం అంత సులువు కాదు. ఓడిపోయి ఉన్నారు కాబట్టి గులాబీ ఎమ్మెల్యేలను లాగడం సులభం. పైగా ఈ విషయంలో బీజేపీ ట్రాక్ రికార్డ్ కూడా గట్టిగానే ఉంది. ఇలాంటి పరిణామాలు కనుక జరిగితే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అనేది ఉంటుందా అనే చర్చ సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking