భర్త వేధించపుతో భార్య, పిల్లలు ఆత్మహత్య

భర్త వేధించపుతో భార్య, పిల్లలు ఆత్మహత్య 

జగిత్యాల, నిర్దేశం:
వరకట్నపు వేధింపులు, భర్త అక్రమ సంబంధంతో మనస్తాపానికి గురై పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో భర్త తిరుపతి వరకట్నపు వేధింపులు, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై.. ఈనెల 14న ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి, భార్య హారిక తాను తాగి ఆత్మహత్య చేసుకుంది. హారిక అక్కడిక్కడే ప్రాణాలు విడవగా.. మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి  ఇద్దరు పిల్లలు కృష్ణాంత్(9), మాయంతలక్ష్మి(8) మృతి చెందారు. తిరుపతి వరకట్నం కోసం నిత్యం వేధించేవాడని, మరో మహిళను ఇంటికి తెచ్చుకునే వాడని హారిక తమతో చెప్పి బాధపడేదని.. ముగ్గురి మృతికి కారణమైన తిరుపతిని కఠినంగా శిక్షించాలని పోలీసులను హారిక కుటుంబసభ్యులు కోరారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »