శివరాత్రి ఎవరి పండుగ..? ఎవరికి పండగ..??

‘శివరాత్రి’  ఎవరి పండుగ?
ఎవరికి పండగ??

దక్షిణ కాశీగా బావించే వేములవాడకు వెళ్ళి, శివున్ని దర్శించుకోవాలనుకునే సామాన్య ప్రజలకు పండుగ! భక్తులకోసం స్పెషల్ బస్ సర్వీసులంటూ, ప్రత్యేక రుషుములతో భక్తుల విశ్వాసాన్ని (మత స్వేచ్ఛను) వ్యాపారం చేసుకునే ప్రభుత్వాలకు పండగ!!

పూల దండలు, పత్రి ఆకులతో లింగాన్ని ఆలంకరించి, పండ్లు పలాలతో ఉపవాస దీక్ష చేసే భక్తులకు పండుగ! పండుగల సీజన్లలో 10/- రూ, పూల పండ్లను 20/- రూ, అమ్ముకునే సామాన్య వ్యాపారస్తు (90%మైనారిటీలు)లకు పండగ!!

శివనామ స్మరణ చేసుకుంటూ, పంచామృతాలతో అభిషేకం చేసుకునే భక్తులకు పండుగ!
బండరాయి మీద పాలు పోయడం మూర్కత్వం, ఆ బండరాయిని పగలగొట్టి రొడ్డువేయడం మానవత్వం అంటూ హేళన చేసే హేతువాదులుకు పండగ!!

పర్వదినాల్లో కొత్త బట్టలు కొని, కుట్టించుకునే భక్తులకు పండుగ!
నేత కార్మికులకు, వస్త్ర వ్యాపారులకు మరియు దర్జీలకు పండగ!!

తమ ప్రాంతాల్లో ముస్తాబైన శివ క్షేత్రాలు, జాతర్లకు వెళ్ళి ఆనందించే భక్తులకు పండుగ!
భక్తులను భద్రంగా జాతర్లకు చేర్చే ఆటో డ్రైవర్లకు, జాతరలో నూటొక్క రకాల వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారులకు పండగ!!

అన్నదానలతో.. వచ్చిపోయే వారందరికీ కడుపునిండా బోజనాలు పెట్టే భక్తులకు పండుగ!
బడుగు – బలహీన, మైనార్టీ వర్గాలవారు లాభదాయక వ్యాపారంతో పాటు కడుపునిండా భోజనంచేసి ఆనందంతో ఇంటికి వెళ్లేవారికి పండగ!!

యేటా వచ్చే వందలాది పర్వదినాల్లో, పండుగల ప్రత్యేకత వాటి ఆచారాలతో పూజిస్తూ నిత్యచైతన్యం పొందే భక్తులకు పండుగ!
హిందూ మతాచారాలు, సాంప్రదాయాలతో వందల కోట్ల వ్యాపారంతో, తమ జీవితాల్లో వెలుగులు నింపుకునే లక్షల కోట్ల కుటుంబాలకు పండగ!!

ఆదిదేవా, పరమశివా
మేము జరుపుకునే పండుగలలో కుల, మత, వర్గాలకతీతంగా ఎందరో సామాన్య ప్రజలు వ్యాపారం చేసుకుంటూ ఆనందాలతో జీవిస్తున్నారు, మరోవైపు ధర్మ హుండీ ఆధాయాలతో ప్రభుత్వ ఖజానతో పాటు, దేశ ఎకానమి కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతుంటుంటే…

అసలు దేవుడే లేదంటూ, నిన్ను నిత్యం దూషిస్తూ, మమ్మల్ని నిత్యం ద్వేషించే వైజ్ఞానిక మేదావుల వల్ల, నాలాంటి హిందువుల్లో ధర్మ రక్షణకై చైతన్యం కలుగుతుంది. వారిని సదా ఆశీర్వదించి, వారు నిండు నూరేళ్ళు, ఆరోగ్యంగా (ఆనందంగా ఎలాగూ వారుండలేరు) ఉండేలా దీవించు దేవా!!!

శివరాత్రి శుభాకాంక్షలతో

– శేరు పోశెట్టి, ఆర్మూర్.
@7732095009

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!