మంత్రి పదవి దక్కేదెవరికో…?

మంత్రి పదవి దక్కేదెవరికో…?
– సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు మధ్య పోటీ
– సామాజిక సమీకరణ ఆధారంగా అవకాశం

నిర్దేశం, నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మధ్య తీవ్ర పోటీ ఉంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. విస్తరణలో జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశముంది. ఢిల్లీ వెళ్లిన రేవంత్ మంత్రివర్గ విస్తరణపై చర్చించేఅవకాశముంది. హైకమాండ్ పెద్దలు అనుమతిస్తే త్వరలో మంత్రివర్గం విస్తరించే అవకాశముంది. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, ఎమ్మెల్సీ అవకాశం లభించినా మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ లభించేది. కానీ ఎమ్మెల్యేగా ఓడిపోవడమేగాక, ఎమ్మెల్సీ అవకాశం కూడా రాలేదు. దీంతో మంత్రివర్గం రేసు నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతం ఇద్దరి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యమంత్రికి బంధువు కావడమేగాక, మంత్రిగా పని చేసిన దృష్ట్యా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో సుదర్శన్ రెడ్డి తనకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. టికెట్లు ఇప్పించుకున్నారేగాని, వారికి సరైన గైడెన్స్ ఇవ్వలేదు. గెలిచే అవకాశమున్నా అభ్యర్థుల నిర్లక్ష్యం వల్ల రెండు స్థానాల్లో ఓటమి చెందారు. సుదర్శన్ రెడ్డి టికెట్ల విషయంలో తలదూర్చకుంటే ఆర్మూర్ కాంగ్రెస్ ఖాతాలో పడేదే. సుదర్శన్ రెడ్డి వల్లే రెండు సీట్లు పోయాయనే అపవాదు ఉంది.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పార్టీలో చురుగ్గా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ గట్టి పోటీనిచ్చి నాలుగైదు వేల స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ప్రస్తుతం మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సామాజికవర్గం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈయన బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు. దయాకర్ రావు ఉప్పందించడం వల్లే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నట్లు రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అప్పటి నుంచి దయాకర్ రావు మీద ఆగ్రహంతో ఉన్నారు. మదన్ మోహన్ కు మంత్రి పదవి ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే. దయాకర్ రావు మంత్రిగా కొనసాగినా, మదన్ మోమన్ కాంగ్రెస్ లోనే క్రీయాశీలంగా ఉన్నారు.

బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్

బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. గౌడ సామాజికవర్గం నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నందున మహేష్ కు అనుమానమే. కానీ ఈయనకు ఢిల్లీ పెద్దల ఆశిస్సులన్నందున కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!