చిరుత మృతికి కారణం ఏమిటి..?
నల్గొండ, మార్చి 29 ( వైడ్ న్యూస్) నల్గొండ జిల్లా నల్లగొండ మండలం, శేషమ్మగూడెం లో చిరుత అనుమానాస్పద మృతి చెందింది. గతంలో స్థానిక రైతులు వ్యవసాయ పొలాల దగ్గర చిరుత కనిపించిందని అధికారులకు సమాచారమిచ్చారు.
దాంతో అప్పట్లో అర్థరాత్రి వరకు అటవీశాఖ, పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ చేసి.. పాదముద్రలు సేకరించారు. చిరుత సంచారంపై క్లారిటీ ఇవ్వలేరు. ఇన్ని రోజులుగా శేషమ్మగూడెం గ్రామస్తులు, రైతులు అందోళనలో వుండిపోయారు. చివరకు గ్రామ శివారులోనీ కంపచెట్లలో చిరుత మృతదేహం లభ్యం అయింది.
కొంతకాలంగా కేశరాజుపల్లి, శేషమ్మ గూడెం, ఎస్టీ కాలనీ, చందనపల్లి గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గతంలో ఆనవాళ్లు దొరికాయి. డంపింగ్ యార్డ్ పక్కన ఊర పందిని తిని వారం పది రోజుల క్రితం చిరుత చనిపోయినట్లు అనుమానిస్తున్నారు అధికారులు.