గోశాలలో ఏం జరుగుతోంది?

గోశాలలో ఏం జరుగుతోంది…

తిరుమల, నిర్దేశం:
తిరుమల గోశాలలో భారీ సంఖ్యలో ఆవులు చనిపోయాయని వైసీపీ ఆరోపణలు చేస్తుంటే అలాంటివి జరగలేదని టీటీడీతోపాటు , కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. తిరుమలలో ఉన్న శ్రీవెంకటేశ్వర గోసంరక్షణ శాలను 1956లో ఏర్పాటు చేశారు. గోవులను రక్షించేందుకు, తిరుమలలో వినియోగించే పాలు ఇతర ఉత్పత్తుల కోసం ఇక్కడ ఈ గోశాలను ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం 2004లో శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీన్ని మొదట డైరీ ఫామ్‌గా స్టార్ట్ చేశారు. తిరుపతికి సమీపంలో 400 ఎకరాల్లో ఉందీ గోశాల. ఈ గోవులకు సంబంధించిన పూర్తి బాధ్యతలు టీటీడీ చూసుకుంటుంది. ఇప్పుడు 200లకుపైగా ఆవులు ఉన్నాయనే మరో మూడు వందలు రాబోతున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. వాటి సంరక్షణకు మాత్రం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ చెబుతోంది. ఇక్కడి ఆవుల పరిరక్షణకు ప్రత్యేకంగా లేటెస్ట్‌ ఫీడ్ మిక్సింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందిని నియమించారు. ఈ గోశాలలో రోజుకు నాలుగు వేల లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తోంది. టీటీడీకి చాలా మంది భక్తులు భారీగా విరాళాలు ఇస్తుంటారు. కొందరు నగదు రూపంలో మరికొందరు ఆభరణాల రూపంలో ఇంకొందరు భూముల రూపంలో విరాళాలు ఇస్తుంటారు.

మరికొందరు భక్తులు గోవులను కూడా స్వామికి సమర్పిస్తుంటారు. టీటీడీకి ఆవులను దానం చేయడానికి ఓ ప్రక్రియ ఉంటుంది. హుండీలో డబ్బులు వేసినంత ఈజీగా ఇది ఉండదు. మీరు అవును దానం చేయాలంటే ముందుగా టీటీడీ కాల్ సెంటర్‌ 0877-22777777 నెంబర్‌కు పోన్ చేయాల్సి ఉంటుంది. వారికి పూర్తి వివరాలు చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ లేదా టీటీడీ అధికారులను సంప్రదించవచ్చు. లేకుంటే శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్ ను కూడా సంప్రదించి ఆవులు దానం చేయవచ్చు. టీటీడీ తీసుకొచ్చిన గోవింద తిరుపతి తిరుమల యాప్ ద్వారా కూడా వివరాలు పొందుపరిచి గోవులను దానం చేయవచ్చు. ఇలా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు దానం చేయాలనుకునే ఆవును గోశాలకు తరలించాలి. ఇలా తరలించిన ఆవులకు అక్కడి అధికారులు రకరకాల పరీక్షలు చేస్తారు. బ్రూసెల్లోసిస్ పరీక్షల్లో నెగటివ్ వచ్చే ఆవు ఆరోగ్యంగా ఉంటేనే స్వీకరిస్తారు. అందులోనీ దేశీయ జాతి అవులను మాత్రమే దానంగా స్వీకరిస్తారు. గోవులతోపాటు నగదు విరాళం ఇచ్చే వాళ్లకు గోకులాష్టమిరోజున గోపూజలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. తిరుమల స్వామి వారికి రెగ్యులర్‌గా జరిగే పూజల్లో ఈ గోశాల నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థాలనే ఎక్కువగా వాడుతుంటారు. తిరుమల గోశాల నుంచి వచ్చే పంచగవ్వ ఉత్పత్తులను నమామి గోవింద పేరుతో విక్రయిస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »