వెయిట్ లాస్…. ప్రాణం లాస్
తిరువనంతపురం, నిర్దేశం:
బరువు తగ్గాలనే ఉద్దేశంతో కేరళకు చెందిన 18 ఏళ్ల యువతి వాటర్ డైట్ ఫాలో అయిందట. అయితే సరైన అవగాహన లేకుండా చేసిన ఈ డైట్ ఆమె ప్రాణాలనే హరించింది. ఆమె చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్స్ వల్లనే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్తున్నారు. ఆ యువతి చేసిన తప్పులు ఏంటి? డైట్ చేస్తూ బరువు తగ్గాలనుకున్న వారు చేయకూడని తప్పులు ఏంటో? బరువు తగ్గడానికి డైట్ని ఫాలో అయ్యేవారు చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సోషల్ మీడియాలో ఓ డైట్ని చూసి ఓ యువతి దానిని ఫాలో అవ్వాలనుకుంది. ఆ డైట్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండా.. వాటర్ డైట్ని ప్రారంభించింది. ఆరు నెలల నుంచి కేవలం నీటిని తీసుకుని.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో చనిపోయింది. షాకింగ్ విషయం ఏంటంటే ఆమె భారీ బరువు ఉంది.. అందుకే ఇలా చేసిందనుకోవడానికి కూడా లేదు. ఆమె కేవలం 24 కేజీలు మాత్రమే ఉందట. అయినా సరే బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఆమె చేసిన ఈ పని అందరినీ షాక్కి గురి చేసింది. బరువు తగ్గాలనే ఉద్దేశంతో కేవలం నీటిని తీసుకోవడం ప్రారంభించి.. పూర్తిగా శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవ్వడం మానేసిందట. అలాగే ఎక్కువసేపు వ్యాయామం చేయాలనే చూసేదట.
దీనివల్ల ఆమె వీక్ అవుతున్నా సరే.. వైద్యుల దగ్గరకు వెళ్లకపోగా.. ఆ డైట్ ఫాలో అవ్వడం మాత్రం ఆపలేదట. దీంతో చనిపోవడానికి 12 రోజుల ముందు ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. వెంటిలేటర్పై ఉంచినా ట్రీట్మెంట్కి ఆమె శరీరం సహకరించక కన్నుమూసింది. బరువు తగ్గడానికి డైట్ ఫాలో అవ్వాలనుకోవడం మంచి విషయమే. కానీ ఇక్కడ తెలియకుండా చాలామంది చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తూ.. ఫుడ్ని కంట్రోల్ చేయడమే డైట్. కానీ దీనిని పక్కన పెట్టి.. శరీరానికి ఏమి కావాలో వాటిని అందించకుండా.. తీసుకునే ఆహారాన్ని కూడా పూర్తిగా కట్ చేస్తారు కొందరు. ఇదే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెప్తున్నారు నిపుణులు. వీటిని ఫాలో అవ్వడం వల్ల బరువు తగ్గుతున్నాము అనుకుంటారు కానీ.. దానికన్నా ఎక్కువగా వీక్గా మారిపోతారని హెచ్చరిస్తున్నారు.సోషల్ మీడియాలో మీరు ఏ డైట్ గురించి తెలుసుకున్నా.. దానిని ఫాలో అవ్వాలనుకున్నా.. దాని గురించిన పూర్తి విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే మీ శరీరానికి ఆ డైట్ వర్క్ అవుట్ అవుతుందో లేదో నిపుణుల సలహాలు తీసుకోవాలి. లేదంటే మీరే వైద్యుల సహాయం తీసుకుని.. వారు ఇచ్చే డైట్ ప్లానింగ్ని ఫాలో అయితే ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకానీ.. సోషల్ మీడియాలో ఎవరో చెప్పారు కదా అని వాటిని గుడ్డిగా ఫాలో అయితే మాత్రం ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. శరీరానికి కావాల్సిన పోషకాలను డైట్లో అందించాలి. మీరు చేసే డైట్లో అది కుదరక పోతే.. నిపుణుల సలహాలతో ఆ పోషకాలను సప్లిమెంట్స్ రూపంలో అయినా తీసుకోవాలి.
డైట్లో ఏ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాలో.. ఏ ఫుడ్కి దూరంగా ఉండాలో తెలుసుకోవాలి. వాటి ప్రకారం సమతుల్యమైన డైట్ని తీసుకోవాలి. ఫుడ్ తీసుకోవడం మానేయడం డైట్ కాదు. శరీరానికి అవసరమైన ఫుడ్ని తగినంత మోతాదులో అందిచడమే నిజమైన డైట్.బరువు తగ్గడానికి డైట్ మేజర్ పాత్ర పోషించినా.. మీ లైఫ్ స్టైల్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీ నిద్ర, మీరు చేసే పనులు, మీ జాబ్, స్ట్రెస్.. ఇలా ఎన్నో కారణాలు బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి.. వాటన్నింటిపై కూడా ఫోకస్ చేయాలి. వ్యాయామం, మెడిటేషన్ కూడా మీ డైలీ రొటీన్లో భాగంగా ఉండాలి. శరీరానికి తగినంత నిద్ర కూడా అందించాల్సి ఉంటుందని మరిచిపోకూడదు. అప్పుడే మీరు హెల్తీగా బరువు తగ్గగలుగుతారు. ఏ డైట్ ఫాలో అవ్వాలనుకున్నా.. డైటీషియన్లు, నిపుణులు, వైద్యుల సహాయం కచ్చితంగా తీసుకోవాలని మరచిపోకండి. గుర్తించుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. అందరీ శరీరతత్వం ఒకేలా ఉండదు. కాబట్టి ఎవరికైనా ఓ డైట్ వర్క్ అయితే దానిని మీరు గుడ్డిగా ఫాలో అవ్వకండి. అలాగే వైద్యులు సూచించినా లేదా మీరు ఫాలో అయ్యే డైట్ కూడా మీకు రిజల్ట్స్ లేట్గా ఇవ్వొచ్చు. కాబట్టి కంగారు పడొద్దు. ఆలస్యంగా ఫలితాలు వచ్చినా.. మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకుని.. వాటిని కరెక్ట్ చేసుకుని.. హెల్తీగా బరువు తగ్గేలా చూసుకుంటే మంచిది.