V6 news వెలుగు డైలీ పేపరును నిషేదిస్తాం

V6 news వెలుగులపై

కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

– జర్నలిస్ట్ యూనియన్ ల డిమాండ్

హైదరాబాద్ : వి6 న్యూస్, వెలుగు దిన పత్రికలపై రాష్ట్ర ఐటీ , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలోనే వి6 న్యూస్, వెలుగులను నిషేదిస్తామని ఆయన పేర్కొనడం దూమరం రేపుతుంది.

రాష్ట్ర ఐటీ , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు వి 6 ఛానెల్ , వెలుగు దినపత్రికను బ్యాన్ చేస్తామని బెదిరించడం ఎంతమాత్రం సమంజసం కాదని జర్నలిస్ట్ యూనియన్ లు తీవ్రంగా ఖండించాయి.  ఎప్పుడు బ్యాన్ చేయాలో తెలుసంటూ వ్యాఖ్యానించడం దారుణమని అభిప్రాయపడింది  వి 6 , వెలుగులో బీఆర్ఎస్ పార్టీ , లేదా ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వార్తలు , చేసిన ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే జాతీయ ప్రెస్ కౌన్సిలకు ఫిర్యాదు చేసుకోవచ్చని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.

మీడియా ముఖంగా అల్టీమేటమ్ ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు . ప్రజలు . ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయనే సంగతి అందరికి తెలిసిందేనని గుర్తు చేశారు .  వి 6 , వెలుగుపై మంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు . లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు టీడబ్లుజెఎఫ్ నాయకులు బి.బస్వాపున్నయ్య, టీబిజెఎ నాయకులు, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్​యూజే)
అధ్యక్షులు: బి అరుణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ బి. జగదీశ్వర్.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!