ఓరేయ్.. మంచిగున్నావురా..?
- పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ఔను… వాళ్లంతా ఒకప్పుడు అరేయ్ అనుకున్నోళ్లే.. కోపం వస్తే ప్రేమతో తిట్టుకున్నోళ్లే.. హోం.. వర్క్ అయిందానే అడుక్కున్నోళ్లే.. వాళ్లంతా పూర్వ విద్యార్థులు.. ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరిని ఒకరు కలుసుకునే అవకాశం లేక సోషల్ మీడియా సమాజంలో బతుకుతున్నోళ్లే.. 46 ఏళ్ల తరువాత కలిసిన పూర్వ విద్యార్థులు కలిసినప్పుడు తమ వృద్దాప్యంను మరిచి పోయి అప్యాయతగా పలుకరించుకున్నారు. ప్రేమతో అలింగనం చేసుకున్నారు. పిల్లలు సెటిలయ్యారా..? అంటూ పరస్పరం అడిగి తెలుచుకున్నారు.
ఈ విద్యార్థులంతా జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని కూనూరు ఉన్నత పాఠశాలలో 1978 లో పదవ తరగతి చదువుకున్నోళ్లు.. ఆదివారం అందరికి వీలుంటుందని చాలా రోజులుగా సమాచారం ఇచ్చుకుని 17 మార్చి 2024 న తమ్మడపల్లి ప్రకృతి చికిత్సలయ ఆవరణలో కలుసుకొన్నారు. బాల్యంలోని మధురసృతులను, తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇరువై అయిదుగురు విద్యార్థులు ఫ్యామిలీగా వచ్చి ఎంజాయ్ చేశారు. తమతో చదివిన మితృలు మరణించారనే వార్త కొంత వారిలో విషాదం నింపింది. ప్రేమ పూర్వకంగా వారికి నివాళులు అర్పించారు పూర్వ విద్యార్థులు.
‘‘దేశం మనకు ఏమి ఇచ్చిందని ఆలోచించకుండా మనం ఈ దేశానికి ఏమి ఇద్దాం..’’ అనే ఆంశంపై చర్చ జరిగింది. మనకు ఎంతో ఇచ్చిన ఈ సమాజానికి మనం కొంతైనా ఇవ్వాలని ఆ పూర్వ విద్యార్థులు నిర్ణయించారు.
ఒకప్పుడు తమకు విద్యబోధన చేసిన గురువులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులు తెలుచుకోవాలని ఉందా.. ఇగో… వీరే వాళ్లంతా..
డాక్టర్ చిలువేరు రవీందర్, ఎం. జయసింహారెడ్డి,పి.నాగార్జున ప్రసాద్,తోట భాస్కర్, శ్రీమతి పద్మ,బి. పిచ్చి రెడ్డి, బొద్దున వెంకటేశ్వర్లు, బద్రీనాథ్, ఎం. నరసయ్య, కాశీ విశ్వనాథ్, జిల్లా రాజేంద్రప్రసాద్, సిహెచ్.రమేష్,మనోహర్, కేశవరెడ్డి, టి రమేష్ రాజయుగంధర్ రెడ్డి,డి వెంకట్ రామ్ రావు, యుగంధర్, మల్లయ్య,ఉస్మాన్ ఖాన్ తదితరులు.
డాక్టర్ చిలువేరు రవీందర్