ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న
టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
హైదరాబాద్ మే 6 : ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ ఆభ్యర్ధులు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడించారు.ఈ సందర్భంగా పెద్ద యెత్తున్న నినాదాలు ఇచ్చారు. టీచర్ పోస్టులు భర్తీ చేసే వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తాం అని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలిపారు.
ఈ ముట్టడి తెలంగాణ జాక్ ఛైర్మన్ నీల వెంకటేష్ నాయకత్వం వహించారు.నిరుద్యోగులు పెద్ద యెత్తున రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాటశాలల్లో 24 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు, ఎయిడెడ్ పాటశాలల్లో 4900 టీచర్ పోస్టులు, ఆదర్శ పాటశాలల్లో 2000, కస్తుర్భా పాటశాలల్లో 1200 టీచర్ పోస్టులుఖాళీగా ఉన్నవి.
ఇవిగాక ప్రభుత్వ పాటశాలల్లో 4 వేల కంప్యుటర్ టీచర్ పోస్టులు, 10 వేల పి.ఇ.టి. పోస్టులు, 5 వేల ఆర్ట్స్, క్రాఫ్ట్స్ & డ్రాయింగ్ పోస్టులు, 3 వేల లైబ్రేరియన్ పోస్టులు, 4 వేల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 10 వేల అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. ఇంత పెద్దఎత్తున ఖాళీగా ఉంటె భర్తీ చేయకుండా ఇటు విద్యార్థుల భవిష్యత్ అటు నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమంలో నీల వెంకటేష్, గూడూరు నాని అంజి, అనంతయ్య, భూపేష్ సాగర్, నిఖిల్ పటేల్, ప్రభాకర్ రెడ్డి, , రాందేవ్ మోడి తదితరులు పాల్గొన్నారు.