రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్బన్ ఏం ఎల్ ఏ ధన్పల్ సూర్య నారాయణ.
(నిర్దేశం, నిజామాబాద్ జిల్లా ప్రతినిధి):
బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ డైవర్షన్ చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ ఎదుగుదలను చూసి అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి కృషితోనే మామూనూరు ఎయిర్ పోర్ట్, మెగా టెక్స్టైల్ పార్క్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలకు కేంద్రం మద్దతు అందించిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు కోసం మతపరమైన ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రంజాన్ సందర్భంగా 10వ తరగతి ప్రీఫైనల్ పరీక్షల షెడ్యూల్ మార్పును తప్పుబట్టారు.
ప్రజలు ప్రశించే సమయం ఆసన్నమైంది అని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.