సిరిసిల్లలో గుర్తుతెలియని మహిళ హత్య
సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణం అనంత నగర్ లో ఓ బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికులు అద్దెకు ఉంటున్న ఇంట్లో గుర్తుతెలియని మహిళ శవం లభించింది. మృతదేహం కుళ్ళిపోయి దుర్గంధం రావడంతో స్థానికులు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పట్టణ సీఐ రఘుపతి సిబ్బందితో చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అద్దెకు ఉన్న బీహార్ కార్మికులు ఫరారీలో ఉన్నారు. అయితే మద్యం మత్తులో కార్మికులు మహిళపై హత్యచారానికి పాల్పడి, హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.