అసెంబ్లీ ఎన్నికలలో నమ్మలేని నిజాలు
సీఎం అప్పు కోటి రూపాయలు
నిర్దేశం, హైదరాబాద్ :
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు అప్పు ఉంది. కోటి రూపాయల అప్పు తన రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వివేక్ వెంకటస్వామికి కోటి అప్పు ఇవ్వాల్సి ఉందని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు సీఎం.
అయితే… సీఎం అప్పు ఉండటంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రాజెక్ట్ ల పేరిట వందల కోట్లు కొల్లగొట్టారని ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తుంటే.. సీఎం స్వయంగా తాను అప్పు ఉన్నట్లు పేర్కొనడం చర్చానీయంశంగా మారింది.
కాగా కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆస్తుల విలువ రూ.606.67 కోట్లుకాగా, చరాస్తులు రూ.380.76 కోట్లు, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు, దంపతులిద్దరి పేరిట ఉన్న అప్పు రూ.45.44 కోట్లుగా వివేక్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. వివేక్ వద్ద సీఎం కేసీఆర్ రూ.1.06 కోట్ల అప్పు తీసుకున్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.కోటిన్నర అప్పు ఇచ్చారట. ఇందుకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంకట స్వామి రూ.680 కోట్లతో తెలంగాణలోనే అత్యంత ధనిక రాజకీయ నేతగా రికార్డు సాధించారు.