ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
సంగారెడ్డి, నిర్దేశం:
కోహీర్ (మం) సిద్దాపూర్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో శంకర్ రాథోడ్(25), పవన్ జటోత్ (26) దుర్మరణం పాలయ్యారు. * మృతులు జహీరాబాద్ (మం) అర్జున్ నాయక్ తండా వాసులు. సిద్దాపూర్ తండా వెళ్తుండగా బైకును ఎదురుగా తాండూరు డిపో ఆర్టీసీ బస్సు ఢీకొంది. కోహీర్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.