టీఎస్ పిఎస్ సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి
జీవితంలో విషాద సంఘటనలు
టీఎస్ పిఎస్ సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి. ఐఎఎస్ ఆఫీసర్ గా గుడ్ వర్కర్ గా పేరుంది. అతని పని తీరుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. జనార్ధర్ రెడ్డి జీవిత ప్రస్థానంలో పదవీ విరమణకు ముందు ఇంటర్ మీడియట్ ఫలితాల లోపాలతో ఆత్మహత్యలు.. పదవీ విరమణ తరువాత పరీక్ష పేపర్ లీకేజ్ ల వ్యవహరం మాయని మచ్చగా మిగిలి పోతుంది.
ఐఎఎస్ ఆఫీసర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది జిల్లాలలో కలెక్టర్ లుగా పని చేసిన అనుభవం అతని స్వంతం. ఎప్పుడు కూడా మచ్చలేని ఐఎఎస్ ఆఫీసర్ గా పేరుంది. కానీ.. ఇప్పుడు టీఎస్ పిఎస్ సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ఈ పేపర్ లీకేజ్ లో నుంచి ఎలా బయట పడుతాడో అనే చర్చ కొనసాగుతుంది.
కలెక్టర్ గా సక్సెస్..
టీఎస్ పిఎస్ సీ చైర్మన్ గా ఫెయిల్
పదవీ విరమణ కాగానే సీఎం కేసీఆర్ ఆశీస్సులతో టీఎస్ పీఎస్ సీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే నిజాయితీగా విధులు నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ.. బయట గెలిచి శబ్బాస్ అనిపించుకున్న ఆయన ఇంట్లో గెలువలేక పోయారు. టీఎస్ పీఎస్ సీ బాస్ గా తన ఆఫీస్ లోని ఉద్యోగుల పని తీరుపై దృష్టి పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. ఆఫీస్ లో పని చేసే ప్రవీణ్ – రాజశేఖర్ ఇద్దరూ పేపర్ లీకేజ్ లో కీలకమైన వ్యక్తులుగా సిట్ అధికారులు గుర్తించారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు పేపర్ లీకేజ్ కు సంబంధించి పదిహేనుగురికి పేపర్ లీకేజ్ కేసులో సంబంధం ఉందని అరెస్టు చేశారు సిట్ అధికారులు. కోర్టు అనుమతితో ఇంకా ఆ నిందితులను విచారణ చేస్తున్నారు.
చైర్మన్ జనార్ధన్ రెడ్డికి కష్టాలు తప్పవా..?
ఔను.. ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ లో ఉద్యోగులను అరెస్టు చేయడంతో సరి పోలేదు. ఈ వ్యవహరంతో సంబంధం లేక పోయినా టీఎస్ పిఎస్ సీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి బాధ్యత వహించాల్సిందే. ఇప్పటికే ప్రతిపక్షాలు ఐటీ మంత్రి కేటీ రామారావును, టీఎస్ పిఎస్ సీ చైర్మన్ జనార్ధర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆందోళనలు కూడా చేస్తున్నారు. గ్రూప్ 1 లో వంద మార్కులకు పైగా వచ్చిన వారందరిని సిట్ అధికారులు నోటీస్ లు ఇచ్చి ఆఫీస్ కు పిలిచి విచారణ చేస్తున్నారు.
అయితే.. పేపర్ లీకేజ్ సంఘటనలో పరీక్ష రాసిన అభ్యర్థులను విచారణ చేస్తున్న సిట్ అధికారులు మరో అడుగు ముందుకు వేసి టీఎస్ పిఎస్ సీ ఉద్యోగులకు నోటీస్ లు ఇచ్చి విచారణ చేయడానికి సిద్దమవుతున్నారు. టీఎస్ పిఎస్ సీ చైర్మన్ జనార్ధర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారణ చేయనున్నారు.
ఈడీ అధికారుల రాకతో..
పేపర్ లీకేజ్ వ్యవహరంపై ఈడీ అధికారులు వారం రోజులుగా విచారణ చేస్తున్నారు. సిట్ అధికారుల విచారణకు సంబందించిన వివరాలను అధికారుల నుంచి సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పేపర్ లీకేజ్ వ్యవహరం న్యూజిలాండ్ వరకు వెళ్లినందున ఈడీ అధికారులు తప్పనిసరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఈడీ అధికారులు విచారణ చేస్తే సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి ఈ పేపర్ లీకేజ్ తో సంబందాలు ఉన్నాయో లేవో అనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది.
సిట్ అధికారులు విచారణ భేష్.. కానీ..
ఇప్పటికే పేపర్ లీకేజ్ కేసులో నిందితుడు ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో ఐదు పేపర్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించడంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అక్టోబర్ 16వ తేదీన జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ పరీక్షను తిరిగి జూన్ 11న మళ్లీ నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు ఈ ఏడాది జనవరి 22న జరిగిన ఏఈఈ, ఫిబ్రవరి 26న జరిగిన డీఏఓ పరీక్షలను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం విధితమే.
కేటీఆర్ కు నోటీస్ ఇచ్చే దమ్ము సిట్ కు ఉందా..?
అయితే.. పేపర్ లీకేజ్ కేసులో పొలిటికల్ లీడర్ లకు నోటీస్ లు ఇస్తున్న సిట్ అధికారులు ఐటీ మంత్రి కేటీఆర్ కు నోటీస్ లు ఇవ్వక పోవడం ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అయినా.. మంత్రి కేటీఆర్ కు నోటీస్ లు ఇచ్చే ధైర్యం లేని సిట్ అధికారులకు బదులుగా సిబిఐ అధికారులకు ఇవ్వాలని బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు.
ఏది ఏమైనా పేపర్ లీకేజ్ ల వ్యవహరం చిలికి చిలికి గాలి వానలా ఎవరి మెడకు చుట్టు కుంటుందో ఎదురు చూడాల్సిందే.