చేపల వేటలో విషాదం
– బావ, బావమరిది నీటిలో మునిగి మృతి
నందిపేట మండలం సిద్ధాపూర్ లో ఘటన.
నిజామాబాద్/ నందిపేట్.
ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా చుట్టరికంగా వచ్చిన బావ తో కలిసి బావమరిది సరదాగా చేపల వేటకు వెళ్లిన సందర్భంలో, ఇద్దరూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించారు.
మచ్చర్ల గ్రామానికి చెందిన 46 ఏళ్ల షేక్ షాదుల్లా మరియు 47 ఏళ్ల షేక్ మహమ్మద్ రఫీక్, ఆదివారం సాయంత్రం నందిపేట మండలం సిద్ధాపూర్ లోని ముని కుంటకు చేపలు పట్టడానికి వెళ్లారు. ఒకరు నీటిలో పడిపోగా, మరొకరు అతనిని రక్షించడానికి కుంటలోకి దిగినప్పుడు, వీరిద్దరూ ఈత రాకపోవడం, నీటి లోతు ఎక్కువగా ఉండటంతో మునిగి మరణించారు.
నందిపేట ఎస్సై చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.