టిప్పర్ బోల్తా..ఇద్దరు మృతి
యాదాద్రి భువనగిరి, నిర్దేశం:
ఆలేరు మండలం, శ్రీనివాసపురం శివారులోని స్టోన్ క్రషర్ క్వారీలో బండరాళ్ల లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ పల్టీ కొట్టింది. ఘటనలో బీహార్ కు చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరొకరికి పరిస్థితి విషమంగా వుంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ..