ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్
ఇద్దరు అక్కడక్కడే మృతి
తిరుపతి, నిర్దేశం
నాయుడుపేట -పూతలపట్టు ప్రధాన రహదారిలోని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఓమన్ స్టే హోమ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఘటనలో కడప జిల్లా, పులి కుంట, బోరెడ్డి వారి పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫకీర్ భాషా(21) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన యువతి ఎవరిని తెలియ రాలేదు. మృతదేహాలను రూయ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉప్పరపల్లె -ఆర్ సి పురం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ఢీకొంది. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.