గంజాయి అక్రమ రవాణా కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై పటిష్ట నిఘా
ఎస్పీ అఖిల్ మహజాన్
రాజన్న సిరిసిల్ల, నిర్దేశం:
జిల్లాలో విస్తృతా గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు
జిల్లాలో 22 కేసులలో 48 మందిని అరెస్ట్ చేసి 2.200 గ్రాముల గంజాయి,12 గంజాయి మొక్కలు స్వాధీనం.
జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి కిట్ల సహాయంతో, నార్కోటిక్ జాగిలాలతో స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 22 కేసులలో 48 మందిని అరెస్ట్ చేసి 2.200 గ్రాముల గంజాయి,12 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని,జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన, సేవించిన వారి సమాచారం ఆర్ ఎస్- ఎన్ ఏ బి, 8712656392 నంబర్ కి అందించలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పింస్తుదని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణా పై స్పెషల్ డ్రైవ్ లు,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు.
గంజాయి అక్రమ రవాణాపై గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు నిర్వహించి గంజాయి సేవించే వారిని వారికి గంజాయి అందించే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు.
జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన సేవించిన వారి సమాచారం ఆర్ఎస్-ఎన్ఏ బి 8712656392 నంబర్ కి అందించలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదని, గంజాయి కి అలవాటు పడిన వారిని పోలీస్ డి ఆడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్ కోసం పై నంబర్ ని సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.