ఔను.. వాళ్లిద్దరు మగాళ్లు పెళ్లి చేసుకోవాలని…

ఆ ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు..

ఔను.. వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు.. ప్రేమంటే అమ్మాయి – అబ్బాయి ఆ ఇద్దరు ప్రేమించుకుంటారు గదా.. కానీ.. ఇక్కడ ప్రేమించుకున్నది ఇద్దరు పురుషులే.. అయినా.. ప్రేమతో జీవితాంతం బ్రతుకాలనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వాళ్లిద్దరి ప్రేమ పోలీసు స్టేషన్ కు వెళ్లింది.

నిజం.. ఈ వింత ప్రేమ కథ విజయవాడలో జరిగింది.

“అయన” “ఆమె” గా మారక “అయన “మోసం చేసాడు.

నాగేశ్వర్ రావు – పవన్ ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్.. మంచి చెడులను షేర్ చేసుకునే వీరి మధ్య లవ్ టాపిక్ కూడా వచ్చేది. ఇద్దరి మధ్య నాకు నీవు నీకు నేను అనే రీతిలో ప్రేమ మొలకెత్తింది. విజయవాడలో బీఈడీ చదువుతున్న వీళ్లిద్దరు పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ భార్యభర్తలుగా జీవించాలని నిర్ణయించుకున్నారు.

అంతే.. ఆ ఆలోచనతో పవన్ ను ఢిల్లీ తీసుకెళ్లాడు నాగేశ్వర్ రావు. పవన్ ను అమ్మాయిగా మార్చించాడు అతను. ఆ తరువాత పవన్ పేరును భ్రమరాంభగా మారింది.

ఇక్కడ మరో ట్విస్ట్..

పవన్ అమ్మాయిగా మారిన తర్వాత పెళ్లికి నిరాకరించాడు నాగేశ్వర్ రావు.

లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఇప్పుడు విజయవాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి చేస్తారో.. విడి పోవాలని నిర్ణయిస్తారో పోలీసులపై ఆశలు పెట్టుకున్నారు ఆ జంట..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!