కుటుంబ వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర కీలకం

కుటుంబ వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర కీలకం

మహిళా లోకానికి కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నిర్దేశం:

కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించడంలో మహిళల పాత్ర ఎంతోకీలకమని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి ని కొనియాడారు. దేశ సంపదను సృష్టించడంలో పౌరులుగా వారి పాత్ర గొప్పదన్నారు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పురుషుడితో సమానంగా నేటి సమాజంలో స్త్రీ పోశిస్తున్న పాత్ర అమోఘమని తెలిపారు. అవకాశాలిస్తే అబల సబలగా నిరూపించుకుంటుందన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర మహిళాభ్యున్నతికోసం అమలు చేసిన పలు కార్యక్రమాలు వారి సాధికారతకు దోహదం చేయాశయని కేసీఆర్‌ గుర్తుచేశారు. మహిళల ఆరోగ్యం, సంరక్షణ, సంక్షేమం తో పాటు పలు కీలక అభివృద్ధి పథకాలల్లో మహిళకే ప్రాధాన్యతనిచ్చామన్నారు. వారి కేంద్రంగానే పథకాలను అమలు చేశామని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రగతిలో మహిళలను నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భాగస్వామ్యం చేసిందన్నారు. అదే స్పూర్థిని కొనసాగిస్తూ మహిళాసాధికారతకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. వారిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని చెప్పారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »