పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
అమరావతి, నిర్దేశం:
ఇటీవల అరెస్టయిన పోసాని కృష్ణ మురళీ చుట్టు కేసుల ఉచ్చు బిగుస్తుంది. ఏపీ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. పోసానిపై 30కి పైగా ఫిర్యాదులు, 14 కేసులు నమోదు అయినట్లు సమాచారం. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి, పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నంలో పోసానిపై కేసులు నమోదయ్యాయి. నరసరావుపేట పీఎస్లో నమోదైన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్పై విచారణ ప్రారంభమయింది.