3న గవర్నర్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్న సీఎం
నిర్దేశం, హైదరాబాద్ :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాజీ డీజీపీ, తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన పి.ఎస్. రామ్మోహన్ రావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నెల 3వ తేది సాయంత్రం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో పుస్తకావిష్కరణ జరగనుంది. తమిళనాడు గవర్నర్ గాను పని చేసిన పీఎస్ రామ్మోహన్ రావు”గవర్నర్ పేట్ టు గవర్నర్ హౌస్” అనే పుస్తకాన్ని రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పివి రంగయ్య నాయుడు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి,రాష్ట్ర డైరెక్టర్ జనరల్ పోలీస్ రవి గుప్త తదితరులు పాల్గొననున్నారు.
పుస్తకం గురించి..
“గవర్నర్ పేట టు గవర్నర్స్ హౌస్” శ్రీ పి.ఎస్ రామ్మోహనరావు జీవితం మరియు వృత్తిపై ఒక ప్రత్యేక దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఈ పుస్తకం పోలీసింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు గవర్నెన్స్ వివరిస్తుంది. భారతీయ రాజకీయాలు, పబ్లిక్ పాలసీ మరియు ఇండియన్ పోలీస్ సర్వీస్పై ఆసక్తి ఉన్నవారితో సహా విస్తృత ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంది.