సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన న్యాయవాద దంపతుల హత్య కేసు

మంథని, నిర్దేశం: దాదాపు నాలుగేళ్ల క్రితం మంథని నియోజకవర్గం కమాన్ పూర్ మండలంలో దారుణ హత్యకు గురయిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు-నాగమణిల హత్య కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన గట్టు కిషన్ రావు తన కొడుకు వామన్ రావు, కోడలు నాగమణిల హత్య కేసులో విచారణ పారదర్శకంగా జరగలేదని, అసలు నిందితులను తప్పించారంటూ ఆయన తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు హత్య ఘటనలో పుట్ట మధుకర్ హస్తం ఉందని గట్టు వామన్ రావు మరణ వాంగ్మూలంలో ఆయన పేరు ఉందని వాదించగా, డిఫెన్స్ న్యాయవాదులు పుట్ట మధుకర్ కు సంభంధం లేదని, కక్ష పూరితంగా ఆయన పేరును ఇరికించారని వాదించారు. ఈ కేసు విచారణను సిబిఐ కి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్ట్ కు తెలుపగ, కోర్టు ఆదేశిస్తే ధర్యాప్తు చేయడానికి తమకు అభ్యంతరం లేదని సిబిఐ న్యాయవాది తెలిపారు. దీనిపై డిఫెన్స్ వారు కౌంటర్ కు రెండు వారాలు గడువు ఇస్తూ కేసును వాయిదా వేశారు. కాగా మరో వారం రోజుల్లో హత్య జరిగి నాలుగు సంవ‌త్స‌రాలు గడుస్తున్న‌ సందర్బంగా ఈ కేసులో ఏమి జరుగుతుందో అని మంథని నియోజకవర్గ ప్రజలు ఉత్కంట గా ఎదురు చూస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »