కుల గణనఫై మాట్లాడే నైతిక అర్హత బిఆర్ఎస్, బిజెపిలకు లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, నిర్దేశం: కరీంనగర్ లో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే మార్గదర్శకం అని అన్నారు. భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ ఎప్పుడో స్పష్టం చేశారని ఎవరి లెక్క ఏంటో తేలాలని, బిఆర్ఎస్ బిజేపి దొందు దొందే రాంగ్ డైరెక్షన్ లో పోయేలాగ ఈ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయని అన్నారు.
బిఆర్ఎస్ బిజేపిలకు కుల గణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదు అని బిజేపి కులగణనను వ్యతిరేకిస్తు అఫిడవిట్ ధాఖలు చేసిందన్నారు, మొన్నటి సర్వేలో పాల్గొనని వారు కేసిఆర్ కేటీఆర్ హరీష్ రావు కు ఫామ్ లు పంపుతున్నాం. మేము ప్రణాళిక సంఘం ఆద్వర్యంలో కులగణన సర్వే చేశాం. మీ వివరాలు ఇప్పుడైనా ఇవ్వండి. అప్పుడే మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది. సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత హక్కు లేదు. బిజేపి కి చేతనైతే దేశవ్యాప్త సర్వే చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండి. నిర్ణయం నుంచి నివేదిక దాకా నివేదిక నుంచి నిధుల దాకా ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని. కాంగ్రెస్ పార్టీ బిసిలకు న్యాయం చేసేలా కృషి చేస్తుంది. మేదావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. బిసి లలో ముస్లీం మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తతి కాదు. అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ క్రిందకు నెట్టవద్దు. ఎర్ర చొక్కా వెసుకున్న వాళ్ళంతా నక్సల్స్ అనడం సరైన పద్దతి కాదు. ప్రగతిశీల భావాలు కలిగిన తాను నిన్న నామినేషన్ సందర్భంగా ఎర్ర చొక్కా వేసుకున్నా. అంతమాత్రాన నేను నక్సలైట్ ను అవుతానా అని ప్రశ్నించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »