Take a fresh look at your lifestyle.

త్వరలో విద్యారంగ వికాసం కోసం TDF డాక్యుమెంట్

0 15

త్వరలో విద్యారంగ వికాసం కోసం TDF డాక్యుమెంట్

హైదరాబాద్, ఆగష్టు 23 : తెలంగాణ పాఠశాల విద్యపై తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (TDF) వివిధ రంగాల మేధావులతో ముఖ్యంగా విద్యారంగ ప్రముఖులతో హైదరాబాద్ లోని సెయిలింగ్ క్లబ్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యారంగం వర్తమాన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఎటువంటి సమస్యల్లో మన విద్యా వ్యవస్థ కొట్టు మిట్టాడుతున్నదీ? తక్షణ, దీర్ఘకాలిక మార్పుల కోసం విధానపరంగా చేపట్టవలసిన అంశాలేమిటీ? అన్న విషయాలపై చర్చించేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ఇప్పటిదాకా వివిధ రంగాల ప్రముఖులతో తాము చేసిన అధ్యయన సారాంశాన్ని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టి డి ఎఫ్ అందరి ముందు చర్చకు పెట్టింది.

ఈ సమావేశానికి ఆచార్య కోదండరాం గారు, ప్రొ హరగోపాల్ గార్లే కాకా జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయ మాజీ కులపతి, MV ఫౌండేషన్ జాతీయ సమన్వ్య కర్త వెంకట్ రెడ్డి గారు, వివిధ రంగాల ప్రముఖులు, ముఖ్యంగా విద్యారంగ నిపుణులు, కాలేజీ ప్రిన్సిపల్స్, క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వివిధర్ని రంగాల నిపుణులు హాజరై తమ సలహా సూచనలు అందించారు. గణాంకాలు పట్టికల్లో వ్యక్తమైన అంశాలకు, అంచనాలకు అదనంగా వారు వాస్తవిక దృక్పథాన్ని జోడించేలా పలు విషయాలు వెల్లడించడం విశేషం.

ఈ సందర్భంగా డిఎఫ్ మాజీ చైర్మన్,. సమావేశ నిర్వాహకులూ ఐన గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ, “మనం ఉన్నత విద్యావంతులుగా ఎదిగిన కారణంగానే, దాని ఫలితంగానే సమాజంలో ప్రముఖ స్థానానికి చేరుకొన్నాం. కీలక రంగాల్లో మన సేవలను అందిస్తున్నాం. ఆ కారణంగా విద్య ఆవశ్యకత ఏమిటో, అది జీవితాల్లో ఎంతటి మార్పు తెస్తుందో మనందరికీ తెలుసు.

అది మన స్వీయానుభవం. విద్యా ఫలాలు ఎలా మన సమగ్రాభివృద్ధికి దోహదపడ్డాయో అదే విధంగా సమాజంలో ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం అందుబాటులోకి రావాలి. అందుకోసం వివిధ రంగాల ప్రముఖులు, మేధావులం కలిసి కట్టుగా సమిష్టి బాధ్యతగా భావించి విద్యారంగ వికాసం నడుం కడుదాం. సమాజ నిర్మాణానికి పునరంకితమవుదాం” అని టిడిఎఫ్ తరపున వారు పిలుపు నిచ్చారు.

ఈ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలను క్రోడీకరించి పూర్తి స్థాయి డాక్యుమెంట్ ను అతి త్వరంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అటు ప్రభుతం, ఇటు పౌర సమాజం ముందు పెడుతామని వారు ప్రకటించారు. తద్వార సమాజ నిర్మాణానికి ముఖ్య వనరు ఐన విద్యా వ్యవస్థను పటిష్టం చేద్దామని తెలిపారు. ఈ సమావేశానికి టిడిఎఫ్ (ఇండియా ) చైర్మన్ రణధీర్ గారు, కందుకూరి రమేష్ బాబు, సంస్థ ఇతర బాధ్యులు హారజయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking