పీజీ మెడికల్ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
హైదరాబాద్, నిర్దేశం:
మెడికల్ విద్యకు సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తెలంగాణ మెడికల్ కాలేజెస్ (అడ్మిషన్ ఇన్‌టు పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులు) రూల్స్ 2017లోని కొన్ని నిబంధనలను సవాల్‌చేస్తూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి ఈశ్వరయ్య దాఖలుచేసిన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ పిల్‌ను విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీప్‌ాలతోకూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ‘పిటిషనర్ ఉద్దేశం మంచిదే అనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. అయితే కోర్టు నిర్ణయాలతో తీవ్రంగా ప్రభావితమయ్యే ఇతర అభ్యర్థుల వాదనలు వినకుండా ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ అధ్యక్షుడి హోదాలో జస్టిస్ ఈశ్వరయ్య ఈ పిల్ వేసినట్లు సమాచారం. పీజీ మెడికల్ అడ్మిషన్లలో మెరిట్ ఆధారంగా సీట్లు పొందిన రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులను ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందడానికి అనుమతించకుండా రిజర్వ్‌డ్ కేటగిరీలో ఎంచుకోవాలని నిబంధన విధించారు. దీంతో రిజర్వ్‌డ్ కేటగిరీలో సీట్లు తగ్గిపోతున్నాయని, ఈ నిబంధనను మార్చాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఈ అంశాన్ని పరిశీలించిన ధర్మాసనం ఇందులో విభిన్న సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయని, ఎవరైనా బాధితులు వ్యక్తిగతంగా కోరితే కోర్టు ఆ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో టీజీఎడ్‌సెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1వ తేదీన రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రాంరెడ్డి తెలిపారు. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో సెట్ ఛైర్మన్, కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 12 నుంచి మే 13వ తేదీ వరకు స్వీకరిస్తారు. రూ 250 అపరాధ రుసుంతో మే 20 వరకు, రూ.500 అపరాధ రుసుంతో మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.