దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం

దక్షిణాదికి అన్యాయంపై స్టాలిన్ ఉద్యమం

కేసీఆర్, రేవంత్, చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానం

హైదరాబాద్, నిర్దేశం:
దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై చర్చించుకుని పోరుబాటను డిసైడ్ చేసేందుకు కలసి రావాలని దక్షిణాది నేతలకు స్టాలిన్ లేఖ రాశారు. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఓ రేంజ్ లో నడుపుతున్న స్టాలిన్ తాజాగా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపైనా అందర్నీ ఏకతాటిపైకి తేవాలని నిర్ణయంచుకున్నారు. ఈ మేరకు దక్షిణాదిలోని కీలక నేతలందరికీ సమావేశం అవుదామని ఆహ్వానం పంపారు. ఈ నెల 22వ తేదీన చెన్నైలో సమావేశం అవుదామని పిలుపునిచ్చారు. కర్ణాటక, కేరళతో పాటు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలకూ ఈ ఆహ్వానాన్ని పంపారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న వాదనను చాలా మంది వినిపిస్తున్నారు. అయితే ఇంకా డీలిమిటేషన్ విధి విదానాలు ఖరారు కాలేదు. కానీ జనాభాను సమర్థంగా నియంత్రించినందున  దక్షిణాదికి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సింది పోయి పనిష్మెంట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే పోరాడాలని స్టాలిన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అంశంపై గతంలో చాలా స్పందించారు.   హాట్ డిబేట్ గా పొలిటికల్  సర్కిల్స్ లో జరుగుతూనే ఉంది. అదే సమయంలో నిధుల పరంగా కూడా అన్యాయం జరుగుతోందన్న వాదనలు ఉన్నాయి.

ఈ కారణంగా సమావేశం అవుదామని.. పోరాట పంధాను ఖరారు చేసుకుందామని స్టాలిన్ పిలుపునిస్తున్నారు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ప్రతిపక్ష నేతలకు కూడా స్టాలిన్ ఆహ్వానాలు పంపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లకు.. చంద్రబాబు, జగన్‌లకు ఆహ్వానాలు పంపారు. బీఆర్ఎస్ పార్టీ కూడా స్టాలిన్ విధానాలను సమర్థిస్తోంది. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని వాదిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ స్టాలిన్ భేటీకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే స్టాలిన్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఇండియా కూటమిలో స్టాలిన్ కూలక వ్యక్తి. దక్షిణాదికి అన్యాయం విషయంలో రేవంత్ కూడా మాట్లాడుతున్నారు. అందుకే రేవంత్ హాజరవడం ఖాయమే అనుకోవచ్చు. మరి రేవంత్ హాజరయితే కేసీఆర్  హాజరు కావడం అసాధ్యం. కేటీఆర్ కూడా హాజరు కాకపోవచ్చని అంటున్నారు. దక్షిణాదికి అన్యాయం నిజమేనని అయినా రేవంత్ తో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేదు కాబట్టి కేసీఆర్ హాజరు కాకపోవచ్చని  భావిస్తున్నారు. ఏపీలో చంద్రబాబునాయుడుకు స్టాలిన్ లేఖ రాశారు. చంద్రబాబు ఎన్డీఏలో   కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపాదనలు వచ్చినప్పుడు దక్షిణాదికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటానని చెబుతున్నారు. ఈ కారణంగా ఆయన ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఈ అంశంపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలియదు. అయితే ఆయన  స్టాలిన్ తో సమావేశానికి హాజరైతే కాంగ్రెస్ కు దగ్గరయ్యారని అంటారు. అందుకే ఆయన కూడా సమావేశానికి హాజరు కాకపోవచ్చని అంటున్నారు. అయితే జగన్ డిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఈ సమావేశానికి హాజరు కావొచ్చని భావిస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »