నిర్దేశం, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన అధ్యక్ష ఎన్నికల చర్చలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో రికార్డ్ యాక్టివిటీ నమోదు అయిందని ఎలోన్ మస్క్ ప్రకటించారు. డిబేట్ ప్రారంభమైన తర్వాత, Xలో నిమిషానికి-నిమిషానికి చర్చ పెద్ద ఎత్తున పెరిగిందని.. మొత్తంగా 90 నిమిషాల్లో 19 సార్లు పెరిగిందని తెలిపారు.
సోషల్ మీడియాలో ఎలోన్ మస్క్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. X డేటా ద్వారా పోస్ట్ చేసిన సమాచారాన్ని మస్క్ రీపోస్ట్ చేస్తూ.. ‘‘డిబేట్ సందర్భంగా Xలో రెండు బిలియన్లకు (200 కోట్లు) పైగా ఇంప్రెషన్‌లు నమోదయ్యాయి. ఇందులో 24.2 కోట్ల వీడియో వ్యూస్, 20 లక్షల పోస్ట్‌లు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఒక అంశంపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడం ఇదే మొదటిసారి. అన్ని సోషల్ మీడియా వేదికలను దాటి X ఈ రికార్డు సృష్టించింది.