సెక్స్టింగ్… ర‌స‌వ‌త్త‌ర‌మైన అనుభూతి!

నిర్దేశం, హైద‌రాబాద్ః ఇంట‌ర్నెట్ పెరిగిపోయాక‌.. అత్యంత హాట్ సైట్ ఏది? అంటే.. ఏ పోర్న్ వెబ్ సైటో అనుకోన‌వ‌స‌రం లేద‌ని, వాట్సాప్ కు మించిన హాట్ మ‌రోటి ఉండ‌ద‌నే మాట వినిపిస్తూ వ‌స్తోంది. అందుకు ముఖ్య‌కార‌ణం.. జ‌నాలు అందులో హాట్ హాట్ గా మాట్లాడుకోవ‌డ‌మే! వాట్సాప్ చాట్ వేడెక్క‌డం మొద‌లై చాలా కాల‌మే అవుతోంది. ఆ వేడి మ‌రింత పెరుగుతూనే ఉంది.

ఐదారేళ్ల క్రితం వ‌ర‌కూ చాట్ చేయాలంటే ఇంట‌ర్నెట్ సేవ‌లు కాస్త కాస్ట్లీ. దీంతో చాలా మంది మొబైల్ డేటా ను ఆఫ్ అండ్ ఆన్ మోడ్ ను వాడుతూ ఉండేవారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడే ఇంట‌ర్నెట్ డేటాను ఆన్ చేసుకునే రోజుల‌వి! లేదంటే… ఇంటి వైఫై క‌నెక్ష‌న్ తో కంప్యూట‌ర్లో ఫేస్ బుక్ లోకి లాగిన్ అయ్యి.. చాట్ చేసుకోవాల్సి వ‌చ్చే రోజుల‌వి. అయితే రోజులు మారాయి. ఇంట‌ర్నెట్ త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉంది. దీనికి తోడు అన్ని ఇంట‌ర్నెట్ సైట్లూ యాప్స్ గా చేతిలోకి వ‌చ్చేశాయి!

ఇందులో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందింది వాట్సాప్. దీని ద్వారా ఎన్నో అవ‌స‌ర‌మైన విష‌యాలు, మ‌రెన్నో అన‌వ‌స‌ర‌మైన విష‌యాలే కాదు, హాట్ హాట్ చాట్ చేసుకోవ‌డం కూడా జ‌నాల‌కు తేలిక‌గా మారింది! అందుకే.. వాట్సాప్ కు హాట్ సైట్ గా పేరు కూడా వ‌చ్చింది. మ‌రి ఏదో సెక్స్ అనుభ‌వం కోసం తాప‌త్ర‌య‌ప‌డే వ‌య‌సులోనే కాదు, ఇంట‌ర్నెట్ సేవ‌లు విస్తృతం అయ్యే కొద్దీ.. సెక్స్ టింగ్ కూడా మ‌నుషుల‌కు ఒక అల‌వాటుగా మారింది.

ప్రేమ బంధంలోనూ, వైవాహిక‌బంధంలోనూ, వివాహేత‌ర బంధాల్లోనూ.. సెక్స్ టింగ్ కామ‌న్ హ్యాబిట్ అని అనేక స్ట‌డీలు చెబుతున్నాయి. ఏ బంధంలో అయినా విర‌హం ఉంటుంది. ఆ విర‌హ‌మే భావాల‌ను వ్య‌క్త ప‌రుస్తుంది. పాత సినిమాల్లో అయితే ఇలాంటి విర‌హాన్ని మ‌ధుర‌మైన గీతాల రూపంలో చూపే వారు. అయితే ప్ర‌తి ఒక‌రి భావ వ్య‌క్తీక‌ర‌ణా ఆ స్థాయిలో ఉండ‌దు క‌దా! అందుకే.. విర‌హాన్ని అందంగా ఎక్స్ ప్రెస్ చేయ‌డం ప‌క్క‌న పెట్టి.. ఓపెన్ గా మాట్లాడేస్తుంటారు.

ఈ సెక్స్టింగ్ ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఇప్పుడు ర‌స‌వ‌త్త‌ర‌మైన అనుభ‌వాల‌ను ఇస్తోంద‌నేది అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. ఉద్యోగాల వ‌ల్ల దూర‌దూరంగా ఉండే భార్య‌భ‌ర్త‌లైనా, ప్రేమ‌ను శృంగారం వ‌ర‌కూ తీసుకెళ్లే వారికైనా, ప‌క్క చూపులు చూసే వాళ్ల‌కైనా సెక్స్టింగ్ మ‌త్తెక్కించేది గా మారిందని ఇంట‌ర్నెట్ ట్రెండ్స్ ను శృంగారశాస్త్రంతో అన్వ‌యించే వాళ్లు చెబుతున్నారు.

ప్రేమ‌లో ప‌డిన స‌హోద్యోగులు ఎదురెదురు కూర్చుని మూడో కంట ప‌డ‌కుండా.. శృంగార సంభాష‌ణ‌ల‌ను, స‌ర‌స‌స‌ల్లాపాల‌ను టెక్ట్స్ రూపంలో ఎక్సైంజ్ చేసుకోవ‌డం, భార్య‌భ‌ర్త‌లైన వారు కూడా ప‌చ్చిగా మాట్లాడుకోవ‌డానికి సెక్స్టింగ్ ను మాధ్య‌మంగా వాడుకోవ‌డం, ఇక ప్రేమ‌లో డైరెక్టుగా ఎక్స్ ప్రెస్ చేసుకోలేని శృంగార కోరిక‌ల‌ను తెలియ‌జేసుకోవ‌డానికి కూడా సెక్స్ టింగ్ ఒక అద్భుత‌మైన‌ మార్గంగా మారింద‌ని అధ్య‌య‌న‌క‌ర్త‌లు చెబుతున్నారు.

మ‌నిషికి భావ‌వ్య‌క్తీక‌ర‌ణ ప్ర‌తి విష‌యంలోనూ ఉంటుంది. దానికి శృంగారం కూడా ఏమాత్రం మిన‌హాయింపు కాదు. అయితే, ఈ స‌హ‌జ ల‌క్ష‌ణానికి ఇంట‌ర్నెట్ వీలైనంత‌గా ఊతం ఇస్తోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!