సీనియర్ ఐపిఎస్ అధికారి పిఎస్‌ఆర్ అరెస్ట్
నిర్దేశం, హైదరాబాద్ :
ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆంజనేయులు పనిచేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ముంబై నటి జత్వాని కేసులో ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో కూడా ఆంజనేయులు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. నేటి వరకు బెయిల్‌కు కూడా ఆంజనేయులు న్యాయస్థానంలో పిటీషన్ వేయలేదు. ఆంజనేయులను విజయవాడకు ఏపీ పోలీసులు తీసుకురానున్నారు. జగన్ ప్రభుత్వంలో నటి జత్వానీపై వైసీపీ నేత విద్యాసాగర్ ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముంబై వెళ్లి జత్వానీతో సహా ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసిన సంఘటన ఆ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్తపై జత్వాని కేసు వేయడంతోనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసును వాపస్ తీసుకోవాలని జత్వానీపై తీవ్ర ఒత్తిడీకి గురిచేశారు. ఈ విషయంలో పీఎస్‌ఆర్ ఆంజనేయులు, సీపీ కాంతిరాణాటాటా, విశాల్ గున్నిల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసును సీరియస్‌గా విచారణ చేపట్టింది.