బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: కేటీఆర్
హైదరాబాద్,నిర్దేశం:
తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ నివాళులర్పించారు. రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి ఎనలేనిది అని కొనియాడారు. సర్వాయి పాపన్న గొప్పతనాన్ని చాటడానికి ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ పోరాటయోధుడి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను అని పేర్కొన్నారు. జోహార్ సర్వాయి పాపన్న! అని కేటీఆర్ నినదించారు.
సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్
సబ్బండ వర్గాల సమానత్వానికి పాటుపడిన పాపన్న :హరీశ్‌రావు
బహుజన పోరాట యోధుడు, సంపన్న వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘన నివాళులర్పించారు. పాపన్న గౌడ్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటేలా ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పాలనలో సబ్బండ వర్గాలను భాగస్వామ్యం చేసి, వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. బహుజనుల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మకమైన పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి వారి అభ్యున్నతికి పాటు పడిరది. పాపన్న గౌడ్ గొప్ప సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.