మాత రమాబాయి త్యాగం దేశానికి రాజ్యాంగాన్ని అందించింది..
– ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్
జగిత్యాల, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి ఇల్లు గడవని కటిక దారిద్ర్యంలో సైతం మొక్కవోని దైర్యంతో భర్త అడుగుజాడల్లో శ్రమిస్తు అనేక త్యాగాలతో తన భర్తను దేశానికి రాజ్యాంగాన్ని అందించేలా చేసిన ఘనత మాత రమాబాయిదని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం మాత రమాబాయి జయంతి సందర్భంగా అమె చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ మాత రమాబాయికి చిన్న వయసులోనే వివాహం జరిగినప్పటి నుండి కష్టాలు వెంటాడుతునే వున్నాయన్నారు ఆయన.
తన పిల్లలు పిట్టల్లా రాలిపోతున్న బాధను గుండెల్లోనే దాచుకుని సమాజమే పిల్లలుగా భావించిన బాబాసాహెబ్ ఉన్నత చదువులకై దైర్యాన్నీ నూరిపోస్తు పిడికల ద్వారా వచ్చిన డబ్బును సమకూర్చిన త్యాగమూర్తి అని పేర్కొన్నారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఒక్కొక్క మెట్టు వెనుక మాత రమాబాయి బాధలతో కూడిన గాయలున్నాయని అమెను స్మరించికోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని పేట భాస్కర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టిపిఎస్ జేఏసీ, టిఎవైఎస్ జిల్లా అధ్యక్షులు కొంగర పవన్,బోనగిరి మల్లారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెవులమద్ది వినోద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర రమేష్, గజ్జెల రాజు, జిల్లా నాయకులు చిర్ర గంగాధర్,వెంకటేష్ గౌడ్ మండల అధ్యక్షులు మారంపల్లి అంజీ,బంగారు దీపక్,ఎస్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.