తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం
హైదరాబాద్ : ఆస్కార్ వేదికపై “ఆర్ఆర్ఆర్” చలనచిత్రం ద్వారా మన భారత చలన చిత్ర పరిశ్రమను యావత్ ప్రపంచ పట్టానిపై రెపరెపలాడుతూ పెట్టింది అన్నారు సినీహీరో నందమూరి రామకృష్ణ. ఈ మేరకు తాను రాసిన లేఖ ఇదే..
ఆస్కార్ వేదికపై “ఆర్ఆర్ఆర్” చలనచిత్రం ద్వారా మన భారత చలన చిత్ర పరిశ్రమను యావత్ ప్రపంచ పట్టానిపై రెపరెపలాడుతూ పెట్టింది “ఆర్ఆర్ఆర్” సినిమా… ముఖ్యముగా మన తెలుగు సినీ కీర్తి పతాకం ప్రపంచ శిఖరాలపై నిలబెట్టి తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది “ఆర్ఆర్ఆర్”…. సినీ నిర్మాత దానయ్య గారికి, సినీ దర్శకేంద్రులు రాజమౌళి గారికి, సంగీత దర్శకులు: ఎమ్.ఎమ్. కీరవాణి గారికి, పాట రచయిత చంద్రబాస్ గారికి, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు,
మరి సంగీతంతో పాటు “నాటు నాటు” పాటకు మరిపించేలా నాట్యం చేసిన మన, రాంచరణ్, తారకు, వీరిద్దరిచేత డ్యాన్స్ చేయించిన ప్రేమ్ రక్షిత్ లకు యావత్ “ఆర్ఆర్ఆర్” చలన చిత్ర బృందానికి పేరు పేరున అందరిని అభినందిస్తూ .… ఆర్ఆర్ఆర్ అవార్డు రాబట్టడానికి సహకరించిన ప్రతిఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ…ఇది మన తెలుగోడి సత్తా, తొలిమెట్టుగా ఆస్వాదించి మరెన్నో గొప్ప సినిమాలు విజయవంతముగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ…
మీ శ్రేయోభిలాషి
నందమూరి రామకృష్ణ