పైకప్పు లేని శివాలయం
నిర్దేశం, శ్రీకాకుళం :
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలో వెలసిన ఎండల మల్లికార్జున స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని ప్రదేశాలలో శివుడికి ఆలయాలు ఉన్నాయి. కానీ ఎండల మల్లికార్జునస్వామికి ప్రత్యేకించి ఆలయం లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆ స్వామి నేటికీ కొండ మీద ఆరుబయటే కొలువై ఉన్నాడు. అంతేకాకుండా కొండమీద కొలువైన శివలింగం అతి పెద్దది.
ఇంత పెద్ద శివలింగం దేశంలోని ఏ ఆలయంలోనూ లేదు. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు.స్వయంభుగా వెలసిన అతిపెద్ద ఈ శివలింగాన్ని దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.
కలియుగ కైలాసంగా రావివలస ఎండల మల్లికార్జునస్వామి ప్రసిద్ధి చెందాడు. మల్లిఖార్జునుడ్ని దర్శించుకునేందుకు జిల్లావాసులతో పాటు.. ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు దేవాలయ అధికారులు.