Take a fresh look at your lifestyle.

బాలకృష్ణపై రోజా కామెంట్..!

0 208

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి రోజా

అమరావతి : వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య డైలాగ్ లు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

అయితే, మంత్రి ఆర్ కె రోజా బాలయ్య డైలాగులపై మండిపడ్డారు. తనదైన రీతిలో కౌంటర్ వేశారు.

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు మంత్రి రోజా. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రోజా.. ముగ్గులపోటీ నిర్వహించి బహుమతులు అందచేశారు.

కుటుంబ సబ్యులతో కలిసి పండగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

చెల్లిగా, హీరోయిన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రతి ఏడాది ఇక్కడ పండగ చేసుకున్నాను. సంక్రాంతి రైతుల పండుగ , రైతులు ఈ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. వైఎస్ఆర్ కుటుంబ పాలనలో రైతులు సుభిక్షంగా ఉంటారన్నారు.

బాలకృష్ణ ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్దం కావడంలేదు.

బాలకృష్ణ గత ప్రభుత్వం పనితీరు చూసి ఇంకా అదే విధంగా ఉందనే అనుకుంటున్నాడు. చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలన్నారు. స్ర్కిప్టులు రాసిఇచ్చినా మాట్లాడలేని పరిస్దితి. 11మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ జీవో నెంబర్ 1ని పూర్తిగా చదివారా? జగనన్న ప్రభుత్వాన్ని ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదం అని విమర్శించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking