పాదయాత్రలో కేశపూర్ లో వరి, మిర్చి తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలు,రైతులను కలిసి వారి సమస్యలు తెలిసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
పంట గిట్టుబాటు గురించి అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి. కూలీలతో కలిసి మిర్చి తెంపాడు అతను. రైతు కూలీలు తెచ్చుకున్న సద్ది లోంచి రేవంత్ కు సీతక్కకు, మల్లు రవి లకు కలిపి ముద్దలు పెట్టిన మహిళలు. జనవరి లో మన ప్రభుత్వం వస్తుందని మహిళలకు భరోసా ఇచ్చిన రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలందరికీ ఇల్లు ఇస్తాం .. ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 5 లక్షలు మంజూరు చేస్తాం అన్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ను గెలిపించేందుకు మీరంతా పని చేయాలని మహిళా కూలీలకు విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి