Take a fresh look at your lifestyle.

ఆర్మూర్ బరిలో రేవంత్ రెడ్డి..? కేసీఆర్ ప్రభావానికి చెక్ పెట్టడమే లక్ష్యం

0 17

ఆర్మూర్ బరిలో రేవంత్ రెడ్డి..?

  • కేసీఆర్ ప్రభావానికి చెక్ పెట్టడమే లక్ష్యం
  • రేవంత్ కు ఆర్మూర్ సెంటిమెంట్

నిర్దేశం, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజక వర్గం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభావం చూపలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రతీగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్మూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం వల్ల ఇతర నియోజక వర్గాలలో బీఆర్ ఎస్ ప్రభావం అడ్డుకోవడమే గాక కాంగ్రెస్ కు అనుకూల వాతవరణం ఏర్పాడుతుందని భావిస్తున్నట్లు తెలిసింది.

ఆర్మూర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, జగిత్యాల్ జిల్లాలకు సరిహద్దులో ఉంది. చుట్టు పక్కల జిల్లాలలో కూడా కాంగ్రెస్ కు అనుకూల వాతవరణం ఏర్పడే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నుంచి ప్రతినిధ్యం వహించారు. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆర్మూర్ నుంచి కూడా పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. కొడంగల్ దక్షణ తెలంగాణ కాగ, ఆర్మూర్ ఉత్తర తెలంగాణ. ఈ రెండు నియోజక వర్గాలలో పోటీ చేయడం వల్ల ఇరు ప్రాంతాలలో ప్రభావం చూపనుంది.

ఆర్మూర్ సెంటిమెంట్..

రేవంత్ రెడ్డికి ఆర్మూర్ సెంటిమెంట్ ఉంది. తనకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ఆర్మూర్ లో నిర్వహించిన రైతు సభే కారణమని గతంలో ప్రకటించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో 2021 జనవరి 30న పసుపు రైతుల సభ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డికి గుర్తింపు వచ్చింది. కొన్ని రోజులకే పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఆర్మూర్ నుంచి పోటీ చేయడానికి ఈ సెంటిమెంట్ కూడా కారణమని తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలో తీవ్రప్రభావం..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పోటీ ప్రభావం తీవ్రంగా చూపే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సరియైన అభ్యర్థులు లేరు. రేవంత్ రెడ్డి పోటీతో అన్ని నియోజక వర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఆర్మూర్ నియోజక వర్గంలో సమీకరణలు పూర్తిగా మారనున్నాయి. కాంగ్రెస్ సర్వేలో సైతం ఆర్మూర్ పూర్తిగా అనుకూలంగా ఉన్నట్తు తేలింది. కానీ సరియైన అభ్యర్థి లేక పోవడంతో ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను చేర్చుకొని పోటీ చేయించాలని భావించారు. రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో అభ్యర్థి కొరత తీరినట్లు అవుతుంది. కామారెడ్డిలో మూడు నెలల క్రితం వరకు షబ్బీర్ అలీకి అనుకూలంగా ఉండగా, కేసీఆర్ పోటీ చేస్తారని ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాయి. కొన్ని వర్గాలు బీఆర్ఎస్ ను వ్యతిరేకించడంతో పాటు, రేవంత్ రెడ్డి ఆర్మూర్ నుంచి పోటీ చేయడంతో సమీకరణలు మారే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking