– మహారాష్ట్ర తరహాలో చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం
– ఇదే జరిగితే అధికారిక బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఔట్
నిర్దేశం, హైదరాబాద్: మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు.. ఇప్పటికే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బోల్తా పడి తీవ్ర సంకటంలో ఉన్న కేసీఆర్ ను చావు దెబ్బ కొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అచ్చం మహారాష్ట్ర తరహాలో గేమ్ ప్లాన్ చేశారని, మరికొద్ది రోజుల్లో కేసీఆర్ మరో ఉద్ధవ్ థాకరే కానున్నట్లు జోరుగా చర్చలు సాగుతున్నాయి. అంటే, గులాబీ పార్టీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలను చీల్చి.. బీఆర్ఎస్ ను అధికారికంగా కేసీఆర్ కు కాకుండా చేసేందుకు సిద్ధమయ్యారట.
తలచింది వేరు జరుతున్నది వేరు
ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇచ్చినప్పటికీ కేసీఆర్ కు కడుపు నిండలేదు. ఇష్టారీతిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిని హేళనగా మాట్లాడారు. అధికార అహంతో వ్యవహరించారు. ఎట్టకేలకు పదేళ్లకు ప్రజలు బుద్ధిచెప్పారు. చింత చచ్చినా పులుపు చావనట్టు, కేసీఆర్ అహం మాత్రం తగ్గలేదు. మళ్లీ అవే కుయుక్తులకు దిగారు. కాంగ్రెస్ కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ లోక్ సభ ఎన్నికలకు ముందు తెగ హడావుడి చేశారు. అంతకు ముందు అధికారం నుంచి మాత్రమే తప్పించిన ప్రజలు, ఈసారి ఈడ్చి కొట్టారు.
పాత కక్షలేనా?
కేసీఆర్-రేవంత్ మధ్య తగాదా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనను జైలుకు పంపడం, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయడం రేవంత్ అంత ఈజీగా మార్చిపోవడని, అయితే సమయం కోసం ఇన్నాళ్లు వేచి చూశారట. ఇప్పుడు టైం రేవంత్ కు రావడంతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కాంగ్రెస్ అనకూల వర్గాల్లో చర్చ సాగుతోంది.