రిటైర్ ఐపీఎస్ ఆఫీసర్  మోసం

రిటైర్ ఐపీఎస్ ఆఫీసర్  మోసం

– ప్రైవేట్ వెహికిల్ కు పోలీసు నెంబర్..  
– డ్యూటీలో ఉన్నట్లుగానే చలామణి.. 
– వేల కోట్ల అక్రమాస్తుల సంపాదన.. 
నిర్దేశం, హైదరాబాద్ : 
పోలీసు ఆఫీసర్… ఆ పేరు వినగానే ఎవరైనా ఈ పోలీసు ఆఫీసర్ తో మనెందుకు గొడవ అనుకునేటోళ్లే ఎక్కువ.. ఖాకీ డ్రెస్ వేసుకోగానే ఏది చేసినా చెల్లుతుందని ఫీలయ్యే వారే పోలీసు ఆఫీసర్ లే ఎక్కువ. కానీ.. రిటైర్ మెంట్ తరువాత కామన్ మెన్ లా బ్రతుకాల్సిందే.. కానీ.. ఓ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యి ఆరేళ్లు గడుస్తున్నప్పటికీ పోలీసు వెహికిల్ నెంబర్ ను పేరుతో తిప్పుతున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నర్సింగ్ మండల కేంద్రంకు చెందిన లెక్కల పురుషత్తమ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబందించిన సాక్ష్యాలను చూయించారు.
నిజమే.. పోలీసు వాహనాలకు నెంబర్ లు ప్రత్యేకంగా ఉంటాయి.. టీఎస్ 09 పి అనే పేరుతో నెంబర్ ఉంటుంది. అయితే… ఐపీఎస్ ఆఫీసర్ గా  దామోదర్ తో వ్యాపారి లెక్కల పురుషత్తమ నాయుడుకు
 పరిచయం పెరిగింది. ఆ ఇద్దరి మధ్య ల్యాండ్ లావాదేవీలు కొనసాగాయి. ఇద్దరి మధ్య ప్రేమతో పురుషోత్తంకు చెందిన టీఎస్ 08 జీక్యూ 0369 నెంబర్ గల ఇన్నోవా వెహికిల్ ఐపీఎస్ ఆఫీసర్ దామోదర్ వాడుకునే వారు. అప్పటికే తాను ఐపీఎస్ ఆఫీసర్ కావడం ఎక్కడికి వెళ్లిన పోలీసు సెక్యూర్టీ ఉంటడంతో ఆ ప్రైవేట్ వెహికిల్ కు పోలీసు డిపార్ట్ మెంట్ కు చెందిన టీఎస్ 09 పీసీ 1002 డుప్లికేట్ నెంబర్ తో తన సొంతానికి ఉపయోగించుకునే వారట..
రిటైర్డ్ అయినా.. డిపార్ట్ మెంట్ నెంబర్ తోనే.. 
అయితే… రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ దామోదర్,  లెక్కల పురుషత్తమ నాయుడుకు  మధ్యను మనస్పార్థాలు వచ్చాయి. ల్యాండ్ వివాదంలో కోట్ల రూపాయల లావాదేవిలతో వచ్చిన విభేదాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే… గురువారం నర్సింగ్ ప్రాంతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన లెక్కల పురుషత్తమ నాయుడు ఐపీఎస్ ఆఫీసర్ దామోదర్ తనను ఎలా మోసం చేశారు.. పోలీసు డిపార్ట్ మెంట్ పేరుతో తన వెహికిల్ ను ఎలా ఉపయోగించుకుంటున్నారో సాక్ష్యాలతో మీడియాకు చూపించారు. అయితే.. చింత చెట్టు చచ్చినా పులుపు చావదు అన్నట్లుగా పోలీసు ఆఫీసర్ గా రిటైర్డ్  అయిన దామోదర్ ఇంకా పోలీసు డిపార్ట్ మెంట్ పేరుతో ఇన్నోవా నడుపుకోవడం చర్చనీయంషంగా మారింది. అన్యాయం జరిగితే న్యాయం చేయాల్సిన పోలీసు డిపార్ట్ మెంట్ లో ఉన్నత పదవులు చేపట్టిన దామోదర్ పురుషోత్తంకు చెందిన ఇన్నోవా వెహికిల్ కు పోలీసు డిపార్ట్ మెంట్ పేరుతో తిరుగుతుంటే పోలీసులు మౌనంగా ఎందుకున్నారనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది.
రిటైర్డ్ ఐపీఎస్ దామోదర్ భూ దందాలు
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దామోదర్ ఈతముక్కలపై హైదరాబాద్ వ్యాపారవేత్త లెక్కల పురుషోత్తమ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. 2014-15లో మంచిరేవల్‌లో భూ లావాదేవీల్లో రూ.10.6 కోట్ల అక్రమ లాభం, రూ.3 కోట్ల అడ్వాన్స్ దుర్వినియోగం చేశాడ‌ని, అలాగే కొనుగోలుదారులను మోసం చేశారని నాయుడు ఆరోపించారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరులో రూ.600-700 కోట్ల బినామీ ఆస్తులు దామోదర్ సమకూర్చుకున్నారని, రిటైర్మెంట్ తర్వాత వాటిని కుటుంబ సభ్యుల పేరిట బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. బినామీ గంటా రాజశేఖర్ రావు ద్వారా నాయుడిని బెదిరిస్తూ, వ్యాపారంలో లిటిగేషన్‌లు సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలు ఐపీఎస్ ఆఫీసర్ దామోదర్ పై విచారణ జరిపించితే  తాను డాక్యుమెంట్లు, వీడియోలతో సహకరిస్తానని నాయుడు విజ్ఞప్తి చేశారు.
Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »