భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారు లాంచ్ గురించి రతన్ టాటా ఏం చెప్పారు?

నిర్దేశం, ముంబై: మారుతీ సుజుకి కార్లు భారతదేశంలోని మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని పెంచుకున్న సమయంలో రతన్ టాటా నాయకత్వంలో టాటా మోటార్స్ స్వదేశీ కారు ‘టాటా ఇండికా’ను విడుదల చేసింది. అయితే టాటా మోటార్స్‌కి మారుతీ సుజుకితో పోటీ పడడం అంత సులభం కాదు. ఏ విదేశీ కంపెనీ సహకారం లేకుండా ఇది జరగదని, చాలా నష్టపోతారని చాలా మంది హచ్చరించారట. కానీ చాలా సార్లు పెద్ద నిర్ణయాలు అయితే ఘోరంగా ఫ్లాప్ అవుతాయి, లేదంటే చరిత్ర సృష్టిస్తాయి. ఇండికా విషయంలో రెండోది జరిగింది. భారత మోటో రంగంలో అతిపెద్ద విప్లవం అది. దానికి ఆధ్యుడు రతన్ టాటా.

మొదటి స్వదేశీ కారు

30 డిసెంబర్ 1998న రతన్ టాటా మొదటి స్వదేశీ కారుగా ఇండికాను విడుదల చేశారు. అది హ్యాచ్‌బ్యాక్ కారు. ఇండికా పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారు ఇదే. 2023లో టాటా ఇండికా 25 వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రతన్ టాటా సోషల్ మీడియాలో హృదయాన్ని హత్తుకునే పోస్ట్‌ షేర్ చేశారు. ఇది ఇప్పుడు చాలా వైరల్‌గా మారింది.

“అంతర్జాతీయ కంపెనీతో వెంచర్ లేదా భాగస్వామ్యం లేకుండా ఇది చేయలేమని చాలా మంది నాతో అన్నారు. ఇలా చేస్తే అపజయానికి గురవుతానని అనిపించింది. కానీ మేము ముందుకే వెళ్ళాము. సాంకేతిక సమస్యలు ఉన్నాయి, మేము చాలా పాఠాలు నేర్చుకున్నాము. కొత్త పుంతలు తొక్కడం ఒక అద్భుతమైన అనుభవం. అక్కడే వదిలేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మేము ముందుకే సాగాము. ప్రతి సమస్యను వర్కవుట్ చేశాం. అది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారు టాటా ఇండికా పుట్టుక. ఈ కారు నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది” అని రతన్ టాటా అన్నారు.

టాటా ఇండికా ఫీచర్లు

ఈ కారు ప్రారంభించిన వెంటనే, టాటా ఇండికాకు భారతీయ కార్ మార్కెట్‌లో డిమాండ్ వేగంగా పెరిగింది. బాడీ పటిష్టత, శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన మైలేజీతో ప్రజల్లో క్రేజ్ పెరిగింది. లోపల ఎక్కువ స్థలం ఉండటమే కాకుండా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇది లీటరుకు దాదాపు 20 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చింది. ఈ కారు విడుదలైన సమయంలో ఇది చాలా ఎక్కువ. పెట్రోల్ డీజిల్ వేరియెంట్లలో వచ్చింది. అయితే డీజిల్ మోడల్‌కు అత్యధిక డిమాండ్ వచ్చింది. దేశంలో ఎయిర్ కండిషనింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న మొదటి కారు ఇండికానే.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!