రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం
నక్సల్స్ – పోలీసుల హింస ఆగేదెప్పుడు..?
ధారావాహిక – 07
నక్సల్స్ ఉద్యమం విరామం.. విరమణ కాదు…
బాణానికి.. బాణానికి మధ్య విరామం.. యుద్ధ విరమణ కాదు.. కదలికలు, చర్యలు, దాడులు, నిలిచి పోవడం ఉద్యమ విరమణా కాదు. శత్రువు తెలివిగా దెబ్బ కొట్టినపుడు దిగ్రాంతితో కలిగే భావాతీత పరిస్థితి. ఈ పరిస్థితిలోకి ఉద్యమాన్ని నెట్టివేయడంలో రాజ్యం నిస్సందేహంగా విజయమే సాధించింది. ఎవరు అంగీకరించినా లేకున్నా.. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాన్ని నీరు గార్చడంలో రాజ్యం గొప్ప విజయమే సాధించింది. యుద్ధం, ప్రచారం, ప్రలోభం, ద్రోహం సహా సామ, దాన, భేద, దండోపాయాలన్నిటినీ రాజ్యం ఏక కాలంలో ప్రయోగించింది. మరోవైపు ఉద్యమకారులు సిద్దాంతం, పోరాటం అనే ఏకైక విధానాన్నే నమ్ముకున్నారు.
ఫలితంగా అనేక నష్టాలు ఎదుర్కొన్నారు.

ఉద్యమమైనా యుద్ధమైనా విరామంలో ఒక వెసులుబాటు ఉంటుంది. జరిగింది సమీక్షించుకోవడం.. భవిష్యత్‌ను రూపొందించుకోవడం.. నిజానికి ఉద్యమానికి విరామాలు కామాలు ఉండవు. అయితే రాజ్యం దృష్టిలో దాడులు, హత్యలు, మందుపాతరలు, పేల్చివేతలు ఉన్నప్పుడు ఉద్యమం ఉన్నట్లు లేనట్టయితే ఉద్యమం నిలిచిపోయినట్లు కాదు. దానికి సంబంధించినంత వరకూ ఉద్యమం శాంతిభద్రతల సమస్యే. ఆ సమస్య ఏర్పడినప్పుడే అది రంగంలోకి వస్తుంది. పరిస్థితులను బట్టి అది కల్లొలిత చట్టమై వస్తుంది. బూటకపు ఎన్‌కౌంటరై వస్తుంది. ఏ రూపంలో వచ్చినా దాని లక్ష్యం ఒక్కటే. దాని స్వభావాన్ని, లక్షణాలని, వ్యవస్థను పరిరక్షించడం. అవి చల్లగా ఉన్నంత వరకూ ఏ ఉద్యమమూ దానికి సవాలు కాదు. అందుకే ‘చర్యలు’ ఆగిపోతే ఉద్యమాన్ని అణచివేయగలిగామని భావిస్తుంది. కానీ, ఉద్యమానికి ఉద్యమకారులకు సంబంధించినంత వరకూ చర్యలు ఆపడం ఉద్యమ విరమణ కాదు. చర్యలే ఉద్యమం కాదు. కాబట్టి
‘‘విరామం’’
అనబడే ఈ సమయంలోనే భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్ట్`లెనినిస్ట్) మావోయిస్టు కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ‘నక్సల్స్’ ఉద్యమాన్ని విసృతంగానే సమీక్షిస్తోంది. మారిన కాలంలో నక్సలైట్లపై ఉక్కుపాదంతో అణిసివేస్తున్న పోలీసులదే పై చెయిగా మారింది. దండకారణ్యం నక్సలైట్లకు కేంద్రంగా భావించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర పోలీసు బలగాలను దింపి జల్లెడ పడుతున్నాయి. అయినా.. ఇలాంటి సమయంలో నక్సలైట్లు పు:న ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల అడ్రసు లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఈ సందర్భంలో మావోయిస్టు కేంద్ర కమిటీ మారుతున్న కాలంలో తమ పంథాను మార్చుకుంటుందా లేదా అనేది చర్చ.
ఇంతకు వరకు మావోయిస్టులు తాజా పరిస్థితులపై అధ్యయనం, శిక్షణ, ప్రచారం, నిర్మాణం, ప్రతిఘటన, చర్య ఇలా అన్ని అంశాలనూ విపులంగానూ, భేషజాలు లేకుండానూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. తప్పులను నిర్మొహమాటంగా చర్చకు పెట్టింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో..

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులు పోటీ ప్రభుత్వం నిర్వహించారు. కానీ.. కాలక్రమేణ పోలీసు నిర్బంధంతో తాత్కలికంగా ఆ ఉద్యమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో కనిపించడం లేదు. నక్సల్స్ దళాలు సంచరిస్తున్నాయనే సమాచారం రాగానే సరిహద్దు రాష్ట్రాల పోలీసులు, వేలాది కేంద్ర పోలీసు బలగాలు అడవులను గాలిస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాల హయంలో తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ లే నిదర్శనం.
అయితే.. నక్సల్స్ ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవడం వారి ముఖ్య ఆయుధం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్భంద కాండతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నక్సల్స్ కార్యకలపాలు లేక పోవడానికి గల కారణాలను ఆత్మవిమర్శ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కేంద్ర బలగాలు దూసుకు పోతున్నప్పటికీ మావోయిస్టు కేంద్ర కమిటీకి కింది స్థాయి కేడర్ కు మధ్య సంబందాలు లేకుండా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పని చేసిన ముప్పాల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పోలీసులకు లొంగి పోతున్నట్లు పత్రికలకు లీక్ లు ఇచ్చిన కేంద్ర ఇంటిలిజెన్స్ వ్యూహం దెబ్బ తింది. అయితే.. అగ్రనేతలను ఎలాగైనా మానసికంగా దెబ్బ తీసి లొంగ తీసుకోవాలని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు తీవ్ర నిర్బంధం ద్వారా నక్సల్స్ కార్యకలపాలను నిర్వహింసకుండా అడవులను జల్లెడ పడుతుంది. అయితే.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నక్సల్స్ కార్యకలపాలు లేకుండా చేయడానికి గల కారణాలను పరిశీలించి అదే ఎత్తుగడతో దేశ వ్యాప్తంగా మావోయిస్టులను లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
అయినా.. మావోయిస్టులు మారుతున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించింది. శత్రువుపై నిరాంతరం జాగ్రత్త పడాలని చెప్పింది. ఉద్యమంలో తలెత్తిన వివిధ ధోరణులను సమీక్షిస్తూ ఉద్యమం నడపడంలో అనేక లోపాలను ధోరణులను ఎత్తి చూపారు. బ్యూరక్రసీ, సెక్టేరియనిజం, లీగలిజం, వ్యక్తిగత పని విధానం, స్పాంటేనిటీ, పరిశీలనా లోపం అధ్యయన లోపం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు మావోయిస్టు నక్సల్స్ అగ్రనేతలు.
(8వ ఎపిసోడ్ లో కలుద్దాం..)