నిర్దేశం చీఫ్ ఎడిటర్ కు ప్రతిష్టాత్మక అవార్డు
విజయవాడ, నిర్దేశం:
ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతి ఏడాది ప్రఖ్యాతిగాంచిన జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలను అందజేస్తుంది. కాగా ఈ ఏడాదికి అవార్డులను గెలుచుకున్న వారి జాబితాను సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఇప్పటికే విడుదల చేశారు. అవార్డుల జాబితాలో నిర్దేశం చీఫ్ ఎడిటర్ యాటకర్ల మల్లేష్ కు చోటు దక్కింది. పరిశోధనాత్మక విభాగంలో మల్లేష్ కు ఈ అవార్డు రావడం విశేషం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తన సేవలు అందించడంతో పాటు, అలాగే సామాజిక బాధ్యతతో ఎన్నో ప్రయోగాత్మక, పరిశోధనాత్మక కథనాలు చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. సుమారు వంద మంది జర్నలిస్టులకు ఆదివారం విజయవాడలో ఈ అవార్డులు ఇవ్వనున్నారు.