తెలంగాణలో రాష్ట్రపతి పాలన
: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ: కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈనెల చివరినాటికి శాసనసభ రద్దయి.. రాష్ట్రపతి పాలన రానుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి పాలనలో ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. రాహుల్‌గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు.
భాజపా మతపరంగా దేశాన్ని చిన్నాభిన్నం చేస్తోందని విమర్శించారు. సూర్యపేట జిల్లా కోదాడలో పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. కోదాడ, హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్‌కు 50వేల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాను చెప్పిన మెజార్టీ రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్ అన్నారు.