Take a fresh look at your lifestyle.

పీఆర్ ఫిలిమ్స్ ‘భరతనాట్యం’ ఫస్ట్ లుక్ విడుదల

0 15

పీఆర్ ఫిలిమ్స్ ‘భరతనాట్యం’ ఫస్ట్ లుక్ విడుదల
నిర్దేశం, హైదరాబాద్ :
పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే, తనతొలి సినిమా ‘దొరసాని’ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. సూర్య తేజ హీరోగా నటించడమే కాకుండా, దర్శకుడు కెవిఆర్ మహేంద్రతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే & డైలాగ్స్ కూడా రాశారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్.మేకర్స్ ఈరోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేసారు. ఈ చిత్రానికి ‘భరతనాట్యం’ అనే క్లాసిక్ టైటిల్‌ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యూనిక్ గా డిజైన్ చేశారు. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ‘సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్’అనేది క్యాప్షన్. టైటిల్‌పై బ్లడ్ మార్క్స్ గమనించవచ్చు.

Leave A Reply

Your email address will not be published.

Breaking