సీఎం కేసీఆర్ కు పాలిటెక్నిక్ రిటైర్డ్ లెక్చరర్స్ లేఖ..

గౌరవనీయులైన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు

ముఖ్యమంత్రి గారికి..

అయ్యా..

వృద్దాప్యంలో మా చివరి కోరిక నెరవేర్చడం గురించి విన్నవించుకోవాలని ఉంది. పెద్ద మనసుతో మీరు మా న్యాయమైన సమస్యను పరిష్కరించాలని మనసు పూర్వకంగా కోరకుంటున్నాం. పాలిటెక్నిక్ లెక్చరర్ లుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మాకు అన్యాయం జరుగుతుందని చెప్పడానికి బాధగా ఉంది.

జీవో ఎంఎస్ 26/10-07-2021 నాడు ఇచ్చిన దాని ప్రకారం 2016 తరువాత పదవీ విరమణ పొందిన వారికి మాత్రమే వర్తించే విధంగా రివైజ్ స్కేల్ ఇచ్చారు. అంతకు ముందు పదవీ విరమణ పొందిన మాలాంటి వృద్దులకు అన్యాయం జరుగుతుంది.

ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు రావడానికి ప్రయత్నం చేశాం. కానీ.. మీ అప్పాయ్ మెంట్ లభించడం లేదు. మా బాధలతో లేఖ రాస్తే రెస్పాన్స్ లేదు. దయచేసి 2016కు ముందు  పదవీ విరమణ పొందిన లెక్చరర్ లకు కూడా జీవో ఎంఎస్ 26/10-07-2021 రివైజ్ స్కేల్ అందే విధంగా మరో జీవో విడుదల చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.. మా ఫైల్ సీఎం ఫేషిలోనే ఉందట.. మీ దృష్టికీ పర్సనల్ సెక్రటరీలు తీసుకు రానాందుకు మాకు అన్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం.

ఇట్లు

పాలిటెక్నిక్ AICTE రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్,

తెలంగాణ

నిజమే.. సీఎం కేసీఆర్ గారికి పదవీ విరమణ పొందిన వృద్దులు రాసిన లేఖలో న్యాయం ఉంది. కరోనా కాలంలో ప్రాణాలో కోల్పోగా మిగిలిన వారంతా ఆశతో సీఎం ఇచ్చి రివైజ్ స్కేల్ కోసం నిరిక్షిస్తున్నారు డెభ్బై ఏళ్లు దాటిన వృద్దులు. జీవితంలో చివరి దశ వృద్దాప్యమే..

 

ఎం. వెంకటేశ్వర్లు. హైదరాబాద్ లోని కొంపల్లిలోని బిడ్డా వద్ద ఉంటున్నారు.  ఆ పెద్దాయన వయసు ఇప్పుడు అక్షరాల 83 ఏళ్లు. 1961లో పాలిటెక్నికల్ లెక్చరర్ గా విధులు ప్రారంభించిన అతను 1998లో పదవీ విరమణ పొందారు. అతని అర్ధాంగి శ్రీలత 13 ఆగష్టు 2021లో మరణించారు. అప్పటి నుంచి ఆ పెద్దాయన అందరూ ఉన్న ఒంటరిగా ఫీలావుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గడం.. కీళ్ల నొప్పులతో పాటు  వృద్దాప్యం మీద పడుతుంది అనే మానసిక వేధన అతనిలో ఉంది.

ఇగో.. ఈ పెద్దాయన వెంకటేశ్వర్లు లాగా ఎం.వి. సుభ్రమాణ్యం, కాంతారావు, దిలీప్, ప్రభాకర్, వీరయ్య, లక్ష్మారెడ్డి, వీరరాజ్ వీళ్లంతా డెభ్బై ఏళ్లు పైన వృద్దులే.. కరోనా రాక ముందు వరకు పే రివైజన్ కోసం కోరినోల్లు 200 మంది పదవీ విరమణ పొందిన వాళ్లు..

కానీ.. ఆనారోగ్యంతో బాధ పడినోళ్లు.. వృద్దాప్యం మీద పడినోళ్లు 60 మంది వరకు మరణించారు. ఇప్పుడు మరో 140 మంది వృద్దులు మాత్రమే బతికి ఉన్నారు. వీళ్లంతా  పాలిటెక్నిక్ లెక్చరర్ లు అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ AICTE స్కెల్ లో ఉంటారు. 7వ పే రివైజన్ కింద లెక్చరర్ గా పని చేసే వారికి రివైజ్ తో అదనంగా డబ్బులు రావాల్సి ఉంది.

123

కానీ… జీవో ఎంఎస్ 26/10-07-2021 రివైజ్ స్కేల్ ప్రకారం 2016కు ముందు రిటైర్డ్ అయిన వారికి రివైజ్ పే స్కెల్ వర్ధించదు. సో.. ముఖ్యమంత్రి కేసీఆర్ 2016కు ముందు రిటైర్డ్ అయిన తమకు వర్థించేటట్లు జీవో ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు రిటైర్డ్ లెక్చరర్స్..

  • ఈదుల్ల మల్లయ్య
Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!