సీఎం కేసీఆర్ పొలిటికల్ గేమ్స్

సీఎం కేసీఆర్ రూటే సఫరెట్

వ్యూహాలలో అతనిని మించినోరే లేరు.

కేసీఆర్  తరువాతే ఎవరైనా..

కేసీఆర్ పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరిస్తుంటారు. ఎప్పటీ కప్పుడు రాజకీయాలను తమకు కలిసి వచ్చే విధంగా చేసుకుంటారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో తాడో పేడో తేల్చుకోవడానికి తగ్గెదేలే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత పేరును పలుమార్లు ప్రస్తావించింది సీబీఐ. ఇప్పటికే ఒకమారు కవితను ప్రశ్నించింది. మరోసారి నోటీస్ ఇచ్చి సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించి అరెస్టు చేస్తారనే వార్తల పుకార్లు షీకార్లు చేస్తున్నాయి. మారిన రాజకీయాల దృష్ట్యా కవిత అరెస్టుకూ చాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

లిక్కర్ స్కాం కేసులో అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, మాగుంట రాఘవ్‌ రెడ్డి లను ఇప్పటికే  సీబీఐ అరెస్టు చేసింది. వారి చార్జిషీట్లలో కవిత పాత్రపై ప్రస్తావన కూడా చేసింది. అయినా.. అసెంబ్లీ ముగింపు సమావేశాలలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తగ్గేదెలే అంటూ ప్రధాని మోదీపై మండి పడ్డారు. కాంగ్రెస్- బీజేపీ దొందు దొందే అంటునే ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసి అసెంబ్లీని రాజకీయ వేదికగా మార్చుకున్నారు కేసీఆర్.

ప్రపంచంలోని చాలా విషయాలను ప్రస్తావిస్తూ భారత దేశంలోని వనరులతో ఎలా అభివృద్ది చేయాలో తనదైన శైలిలో ఉదాహరించారు. జవహర్ లాల్ నెహ్రూ మినహా దేశంలో ఏ ప్రధాని ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శలు చేశారు. ప్రధాని మన్ మోహన్ సింగ్ అభివృద్ది చేసినా ప్రచారం చేసుకోలేదన్నారు. వందేమాతరం రైలును పదునాలుగు సార్లు ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీగా రికార్డు సృష్టించారన్నారు. అసెంబ్లీని రాజకీయ వేదికగా మార్చి ప్రధాని మోదీపై విమర్శలు కురిపిస్తుంటే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు నవ్వుతూ కేసీఆర్ స్పీచ్ కు మద్దతు పలికారు.

ఒకవైపు లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచినా సీఎం కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఎక్కడా కూడా తగ్గడం లేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే బీఆర్ ఎస్ కు ప్రత్యార్థిగా బీజేపీ ఎదుగుతుందానే భావనతో సీఎం కీసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి పారెస్తున్నారు. మాస్టర్ గేమ్ ఆడటంలో కేసీఆర్ ను మించిన మొనగాడు మరోకరు ఉండరు. అతని ఎత్తులు, వ్యూహలు ఇప్పటి వరకు సక్సెస్ పర్సెంటెజ్ ను చూపిస్తోంది.

కేసీఆర్ నోట పన్నెండు సార్లు ఈటెల మాట

అసెంబ్లీ సాక్షిగా బీజేపీ జాతీయ నాయకులు, ఎమ్మెల్యే ఈటెల రాజేంధర్ ముదిరాజ్ పేరును తరచు ప్రస్తావించడం కూడా ఎత్తుగడలో భాగమే. నెల రోజుల క్రితం ఈటెల రాజేంధర్  బీఆర్ ఎస్ లో చేరుతున్నారని ఏకంగా ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికాలో స్పెషల్ స్టోరీ రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఇటీవల ఇలాంటి వార్త కథనాలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే.. తనను డ్యామెజ్ చేసేందుకు సీఎం కేసీఆర్ అలా తన ప్రస్తావన తీసుకు వచ్చాడన్నారు ఈటెల రాజేంధర్. కేసీఆర్ స్వయంగా పిలిసినా తాను బీఆర్ ఎస్ లోకి పోనాని అన్నారు ఆయన. తనపై కేసీఆర్ చేసిన దాడి, పెట్టిన ఇబ్బందులు ప్రజలు మరిచి పోలేదని, పలుకరించుకుంటే పక్కన కూర్చుంటే పార్టీలు మారే కల్చర్ తనది కాదన్నారు ఈటెల రాజేంధర్.

 స్పీకర్ మౌణం ఎలానోయ్..

అయితే.. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీని అవమానిస్తుంటే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మౌణంగా ఎందుకు ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ నిలదీసారు. జగిత్యాల్ జిల్లా కొరుట్లలో జరిగిన సభలో ఆయన సీఎం కేసీఆర్ ను ఉతికి పారెశారు.

అన్నా చెల్లెలు సీరియస్ గా..

శాసన మండలి సమావేశంలో మంత్రి కేటీఆర్ – ఎమ్మెల్సీ కవితలు అట్రాక్షన్ గా నిలిసారు. సభ కొనసాగుతుండగా కవిత తన సోదరుడు కేటీఆర్ తో సీరియస్ గా మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ సీరియస్ గా ముందుకు వెళుతున్నందున కవిత అరెస్టు చేస్తారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఓ సాక్షిగా కల్వకుంట్ల కవితకు 160 సీఆర్‌పీసీ కింద డిసెంబరులో సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే ఏడు గంటలకుపైగా విచారించింది. కేసు దర్యాప్తుకు సంబంధించి వారికి కావాల్సిన సమాచారం సేకరించింది. అవసరమైతే మరోసారి విచారిస్తామని అప్పట్లోనే చెప్పినా.. ఇప్పటి వరకు ప్రశ్నించలేదు.

సీఎం కేసీఆర్ స్టైలే వేరు..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు.. అసెంబ్లీలో పన్నెండు సార్లు ఈటెల రాజేంధర్ పేరును కేసీఆర్ ప్రస్తావించడం.. ప్రధాని మోదీని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ విమర్శలు గుప్పించడం.. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే.. ఈ పరిణామాలు అన్నీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత చుట్టూ తిరుగుతున్నాయనేది విశ్లేషకుల వాదన.

మొదటి నుంచి కూడా సీఎం కేసీఆర్ తన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కున్న విషయంపై సీరియస్ గా స్పందించిన దాఖలాలు లేవనే చెప్పాలి. ప్రధాని మోదీపై తగ్గెదెలేదంటున్న సీఎం కేసీఆర్ వ్యహం ఎమిటో అర్థం కావడం లేదంటున్నారు పలువురు.

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!