విదేశీయులను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్, నిర్దేశం:
నగరంలో చాలామంది విదేశాల నుంచి వచ్చి వీసా గడుపు ముగుస్తున్నా అక్కడకు వెళ్లడం లేదు. దీంతో ఇలాంటి వారిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ కమ్రంలోనే వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు విదేశీయులను వెస్ట్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి దేశాలకు పంపించారు. లైబీరియాకు చెందిన కర్మో మార్టిన్ స్టూడెంట్ వీసాపై 2019లో నగరానికి వచ్చాడు. నిజాం కళాశాలలో 2020 నుంచి 2023 వరకు చదువుకున్నాడు. బ్యాక్ లాగ్‌లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇస్తూ వీసాను పొడిగించుకుంటున్నాడు. సీసీఎస్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని ఫిబ్రవరి 26న లెబనాన్‌కు పంపించారు. ఉగాండాకు చెందిన పి కబటుకు మేరీ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలంటూ మెడికల్ వీసాపై 2024 డిసెంబర్‌లో నగరానికి వచ్చింది. నగరంలో ఉంటూ వ్యభిచారం చేస్తుండగా సీసీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో మెడికల్ వీసాపై వచ్చిన మేరీ ఇప్పటి వరకు అపోలో ఆస్పత్రికి వెళ్లలేదని తెలుసుకున్నారు. ఆమెను ఈనెల 4న ఉగాండాకు తిరిగి పంపించారు. నైబీరియాకు చెందిన స్టూడెంట్ వీసాపై 2022లో నగరానికి వచ్చాడు. ఏవీ కాలేజ్‌లో చదువుకునేందుకు వీసా తీసుకున్న ఇతడు కనీసం అడ్మిషన్ కూడా తీసుకోకుండా అక్రమంగా ఉంటున్నాడు. వ్యభిచార గృహం నిర్వహణ కేసులో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని ఈనెల 5న లైబీరియాకు పంపించారు.