Take a fresh look at your lifestyle.

1989లో ఎన్టీఆర్ ఓడి పోయారు.. కామారెడ్డి నుంచి కేసీఆర్ ఓడి పోతే ..?

0 22

కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారా..?

1989లో ఎన్టీఆర్ ఓడి పోయారు..
ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ ఓడి పోతే.. ?
సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఓటమి ఒడ్డున..

కేసీఆర్.. కామారెడ్డి – గజ్వేల్ ఈ రెండు నియోజక వర్గాలు కేంద్ర బిందువుగా పొలిటిక్స్ నడుస్తోంది. అందరి కంటే ముందే అసెంబ్లీకి పోటీ చేసే సీట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారా అనే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు గజ్వేల్ లో ఓడి పోతాననే భయంతో కామారెడ్డి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారా..? అనే ప్రశ్న తలెత్తుతుంది. మారుతున్న రాజకీయ పరిస్థితులలో అభ్యర్థులను మార్చితే ఒటమిని కేసీఆర్ అంగీకరించినట్లేననే టాక్ పబ్లిక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

కేసీఆర్ నిర్ణయం వెనుక…

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తా చాటారు. ముచ్చటగా మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధించాలనే కేసీఆర్ కలలకు అతను తీసుకునే నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయనేది రాజకీయ పండితులు చెబుతున్న మాట. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్టీ రామారావు అనంతపురం జిల్లా హిందూపురంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి ఈ రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. కల్వకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో టీడీపీ అభ్యర్థి ఎన్టీ రామారావు ఓడి పోయారు. అయితే… గజ్వేల్, కామారెడ్డి లలో ప్రతి పక్షపార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, మైనార్టీ నాయకుడు షబ్బీర్ అలీ, బీజేపీ నుంచి వెంకటరమణ రెడ్డి పోటీలో నిలబడనున్నారు.

కేసీఆర్ కూతురు ఓడింది నిజామాబాద్ లోనే…

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎన్నికలలో మొదటి నుంచి భిన్నమైన తీర్పు చెబుతున్నారు. ఎన్టీఆర్ హవాలో కూడా జిల్లా ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టిన చరిత్ర ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బీజేపీ అభ్యర్థి అరవింద్ చేతిలో ఓడి పోయింది. భారీ మెజార్టీతో ఎంపీ గా కవిత గెలుస్తోందని భావించిన పార్టీ వర్గాలు కవిత ఓటమిని తట్టు కోలేక పోయారు.

అయితే.. గతంలో గజ్వేల్ నుంచి కేసీఆర్ పై పోటీ చేసి ఓడిన ఒంటెద్దు ప్రభాకర్ రెడ్డిని తిరిగి కేసీఆర్ పార్టీలోకి తీసుకుని తగిన పదవి ఇచ్చాడు. ఇప్పుడు కూడా కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసి ఓడినా గెలిసినా చరిత్రలో ఉండి పోతామనే భావనను ప్రతి పక్షాలు భావిస్తున్నాయి. అయితే… ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు, నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలువాలేవని సర్వేలు చెప్పడంతో రానున్న కాలంలో రాజకీయాలు ఎలా మారుతాయో ఎదురు చూడాల్సిందే..

– యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking